MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు..!

Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు మంచి నీళ్లలా ఖర్చు చేస్తారు..!

Birth Stars: డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే..దానిని నిర్వహించడం మరో ఎత్తు. జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తే, మరి కొందరు  ఎక్కువగా పొదుపు చేస్తారు. మరి డబ్బును  ఖర్చు చేసే నక్షత్రాలేంటో చూద్దామా..

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
1.డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే నక్షత్రాలు...
Image Credit : stockPhoto

1.డబ్బును ఎక్కువగా ఖర్చు చేసే నక్షత్రాలు...

జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారు విలాసాలకు, సౌకర్యాలకు, ఇతరులకు సహాయం చేయడానికి వెనకాడకుండా ఖర్చు చేస్తారు.

భరణి నక్షత్రం.. వీరికి అధిపతి శుక్రుడు. వీరు రాజసం ఉట్టిపడేలా బతకాలని కోరుకుంటారు. బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన దుస్తుల కోసం వీరు చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆడంబరాల కోసం ఖర్చులు..
Image Credit : AI Generated

ఆడంబరాల కోసం ఖర్చులు..

పుష్యమి నక్షత్రం.. ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులకు సహాయం చేయడానికి లేదా కుటుంబ అవసరాల కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. పొదుపు కంటే దాన ధర్మాలకు, విందులకు ప్రాధాన్యత ఇస్తారు.

పూర్వాషాఢ నక్షత్రం: వీరు కూడా శుక్రుడి ప్రభావం వల్ల విలాసవంతమైన ప్రయాణాలకు, వినోదాలకు ఎక్కువగా డబ్బు వెచ్చిస్తారు. చేతిలో రూపాయి ఉన్నా అది ఖర్చు అయ్యే వరకు వీరికి నిద్ర పట్టదు.

జ్యేష్ఠ నక్షత్రం: వీరు తమ హోదాను చాటుకోవడానికి, ఆడంబరాల కోసం డబ్బును విపరీతంగా ఖర్చు పెడతారు.

33
డబ్బును పొదుపు చేసే నక్షత్రాలు (The Savers)
Image Credit : AI Generated

డబ్బును పొదుపు చేసే నక్షత్రాలు (The Savers)

వీరు ప్రతి పైసాను లెక్క చూసుకుంటారు. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడంలో వీరు దిట్టలు.

కృత్తిక నక్షత్రం: వీరు చాలా పక్కాగా ఉంటారు. అవసరం లేని వస్తువులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు. వీరు గొప్ప పొదుపురులు.

ఉత్తరాషాఢ నక్షత్రం: వీరు చాలా లోతైన ఆలోచన గలవారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకూడదని ముందు జాగ్రత్తతో డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు.

మఖ నక్షత్రం: వీరు సంప్రదాయ పద్ధతుల్లో డబ్బును దాస్తారు (బంగారం లేదా భూమి రూపంలో). డబ్బు విలువ వీరికి బాగా తెలుసు.

చిత్త నక్షత్రం: వీరు ప్రతి ఖర్చును ప్లాన్ చేసుకుంటారు. ఆకర్షణీయమైన వస్తువుల కంటే ఉపయోగపడే వస్తువులకే ప్రాధాన్యత ఇస్తారు.

3. మధ్యస్థంగా ఉండేవారు (The Balanced Ones)

రోహిణి, హస్త, శ్రవణం: ఈ నక్షత్రాల వారు అవసరానికి తగ్గట్టుగా ఖర్చు చేస్తారు, అలాగే పొదుపు కూడా చేస్తారు. వీరు బ్యాలెన్స్‌డ్ లైఫ్ లీడ్ చేస్తారు.

జ్యోతిష్య విశ్లేషణ

ఖర్చు , పొదుపు అనేవి కేవలం నక్షత్రం పైనే కాకుండా మీ జాతకంలోని 2వ ఇల్లు (ధన స్థానం) , 12వ ఇల్లు (వ్యయ స్థానం) బలాన్ని బట్టి కూడా మారుతుంటాయి. నక్షత్ర అధిపతి శుక్రుడు లేదా రాహువు అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అదే శని లేదా గురువు బలంగా ఉంటే పొదుపు ఎక్కువగా ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. వ్యాపారంలో పురోగతి!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 4 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది! మీది ఏ రాశి?
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసిరావు!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved