MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Kitchen Vastu: వంటగదిలో చెప్పులేసుకుని వంట చేస్తే జరిగే అనర్థాలు ఇవే

Kitchen Vastu: వంటగదిలో చెప్పులేసుకుని వంట చేస్తే జరిగే అనర్థాలు ఇవే

Kitchen Vastu: భారతీయ సంస్కృతిలో వంటగదికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. పెద్దలు చెబుతున్న ప్రకారం వంటగదిలోకి చెప్పులు వేసుకుని వెళ్ల కూడదు కూడా. కానీ ఇప్పుడు కొంతమంది చెప్పులు వేసుకుని వంట చేస్తున్నారు. దీని వల్ల ఏం జరుగుతుందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 22 2026, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అన్నపూర్ణ దేవి నివాసం
Image Credit : Chat gpt

అన్నపూర్ణ దేవి నివాసం

వంటగది అంటే కేవలం ఒక గది లేదా ప్రదేశం కాదు. అది ఎంతో పవిత్రమైనది. ఈ గది సంపద, శ్రేయస్సుకు అధిదేవత అయిన అన్నపూర్ణా దేవి నివసించే స్థలంగా చెప్పుకుంటారు. బయటి నుంచి ఆ చెప్పులతోనే వంటగదిలోకి వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు. అలా చేస్తే అన్నపూర్ణ దేవిని అవమానించినట్లేనని పురాణాలు చెబుతున్నాయి. హిందూ ధర్మం ప్రకారం, దేవుడు ఉండే చోటికి చెప్పులతో వెళ్లకూడదు. అలాంటప్పుడు వంటగదిలో చెప్పులు వేసుకుని వంట చేస్తే అది అన్నపూర్ణ దేవికి కోపం తెప్పిస్తుంది.

24
వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
Image Credit : Getty

వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

వాస్తు శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది.  రాజవల్లభ, సమరాంగణ సూత్రధార వంటి ప్రాచీన వాస్తు గ్రంథాల్లో చెప్పులు వేసుకుని వంట చేయడం గురించి ప్రస్తవిం ప్రస్తావన ఉంది. ఈ రెండు శాస్త్రాలు చెబుతున్న ప్రకారం ఇంట్లోని రెండు ప్రదేశాలను ఎప్పుడైనా పరిశుభ్రంగా ఉంచాలి. అవి పూజగది, వంటగది. ఈ రెండూ గదులు పరిశుభ్రతంగా ఉంటేనే దేవతలు కరుణిస్తారు.  ఈ రెండు గదులు పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. 

Related Articles

Related image1
Kumbh Mela Monalisa: చంపేస్తామంటున్నారు కాపాడండి ప్లీజ్.. కుంభమేళా మోనాలిసా కన్నీళ్లు
Related image2
Building Home: పిల్లల కోసం ఇల్లు కట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.. తల్లిదండ్రులకు వ్యాపారవేత్త సలహా
34
నెగెటివ్ ఎనర్జీ ప్రవేశం
Image Credit : Getty

నెగెటివ్ ఎనర్జీ ప్రవేశం

వాస్తు శాస్త్రం ప్రకారం చెబుతున్న ప్రకారం బూట్లు, చెప్పులతో రాహు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెప్పుల వల్ల నెగెటివ్ ఎనర్జీ వంటగదిలోకి చేరే అవకాశం ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ చెప్పులు వేసుకుని వంట చేసిన ఆహారం ద్వారా కుటుంబ సభ్యులకు వ్యాపిస్తుంది. దీనివల్ల అనారోగ్యాలు వస్తాయి. అలాగే ఇంట్లో అనవసర గొడవలు, ధన నష్టం వంటివి జరిగే అవకాశం ఉంది.

వాస్తు, మతపరమైన కోణంలోనే కాదు ఈ విషయాన్ని సైన్సు పరంగా కూడా చూసినా కూడా ఈ అలవాటు చాలా హానికరం. మనం బయట తిరిగే చెప్పులతో పాటు  సూక్ష్మక్రిములను, బ్యాక్టీరియాను ఇంట్లోకి వస్తాయి. అవే చెప్పులను వంటగదిలో వాడితే ఆ బ్యాక్టిరియా, వైరస్ మన ఆహారంలో చేరే అవకాశం ఉంది దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతినవచ్చు.

44
పరిష్కారం ఇదిగో
Image Credit : Getty

పరిష్కారం ఇదిగో

 చలికాలంలో నేల చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఆ కాలంలో ఎక్కువ మంది చెప్పులు ఇంట్లో వేసుకుంటారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి వైద్యులే చెప్పులు ధరించమని సలహా ఇస్తారు. అలాంటి సమయం చెప్పులు వేసుకోక తప్పదు. కానీ వంట చేసేటప్పుడు ఆ చెప్పులు తీసేస్తే సరిపోతుంది.

ఇంట్లో వేసుకోవడం తప్పనిసరి అనుకునేవారు కొన్ని సులభమైన వాస్తు నియమాలను పాటించవచ్చు. బయట వేసుకునే చెప్పులను ఇంట్లోకి వాడకండి. ప్రత్యేకంగా వంటగది కోసం శుభ్రమైన ఉన్ని లేదా వస్త్రంతో చేసిన  చెప్పులను వాడండి. వాటిని వేసుకుని ఎప్పుడూ బయటకు లేదా బాత్రూమ్‌కు వెళ్లకండి. వంటగది అన్నపూర్ణా దేవి, అగ్ని దేవుడి నిలయంగా భావిస్తారు. అపవిత్రమైన పాదాలతో అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ః

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం 3 రాశులవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే కష్టమే!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారికి ఈ రోజు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు వస్తాయి!
Related Stories
Recommended image1
Kumbh Mela Monalisa: చంపేస్తామంటున్నారు కాపాడండి ప్లీజ్.. కుంభమేళా మోనాలిసా కన్నీళ్లు
Recommended image2
Building Home: పిల్లల కోసం ఇల్లు కట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.. తల్లిదండ్రులకు వ్యాపారవేత్త సలహా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved