MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Building Home: పిల్లల కోసం ఇల్లు కట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.. తల్లిదండ్రులకు వ్యాపారవేత్త సలహా

Building Home: పిల్లల కోసం ఇల్లు కట్టి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.. తల్లిదండ్రులకు వ్యాపారవేత్త సలహా

Building Home: ఒక వ్యాపారవేత్త చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిల్లల కోసం ఇల్లు కట్టి జీవితాంతం ఆ అప్పులు తీరుస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని భారతీయ తల్లిదండ్రులకు సలహా ఇచ్చాడు జస్వీర్ సింగ్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 22 2026, 06:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంటికోసం జీవితమే పణం
Image Credit : chatgpt

ఇంటికోసం జీవితమే పణం

ఒక వ్యాపారవేత్త చేసిన కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులలో చర్చకు దారితీసాయి. గురుగ్రామ్ కు చెందిన వ్యాపారవేత్త జస్వీర్ సింగ్ పిల్లల కోసం ఇల్లు కట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ తల్లిదండ్రులను ఉద్దేశించి కామెంట్లు చేశారు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారతీయ కుటుంబాల్లో పిల్లల భవిష్యత్తు కోసం చాలామంది తల్లిదండ్రులు ఇల్లు కట్టడాన్ని పెద్ద లక్ష్యంగా భావిస్తారు. ఆ ఇల్లు కోసం తమ జీవితాన్నే పణంగా పెడతారు. జీవితాంతం ఆ ఇంటి కోసం చేసిన రుణాలను తీరుస్తూనే ఉంటారు. ఈ విషయంపైనే జస్వీర్ సింగ్ మాట్లాడారు. అసలు ఆయన ఏమన్నారు? పిల్లలకు పెంపకం విషయంలో ఎలాంటి సలహాలు ఇచ్చారో తెలుసుకోండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఎవరు జస్వీర్ సింగ్
Image Credit : Getty

ఎవరు జస్వీర్ సింగ్

జస్వీర్ సింగ్ ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు. ఆయన నాట్ డేటింగ్ అనే కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన కుటుంబంలో జరిగిన అనుభవాన్ని ఉదాహరణగా చూపించారు. తన తాతగారు ఎంతో కష్టపడి ఇల్లు కట్టారని, ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉందని చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బును ఆ ఇంటిని కట్టేందుకే ఉపయోగించారని, కానీ ఆ ఇంట్లో తన తండ్రి నివసించలేదని చెప్పారు. తన తాత కష్టమంతా వృధా అయిపోయిందని.. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారని వివరించారు.

Related Articles

Related image1
Anchor Suma: సుమ గారి భర్త కాదు.. సుమ వదిలేసిన భర్త అనకుండా చూసుకో, రాజీవ్ కనకాలకు కౌంటర్
Related image2
Birth Date: ఈ తేదీలలో పుట్టిన వారికి విపరీతమైన ఇగో.. వీరితో స్నేహం, శత్రుత్వం రెండూ డేంజరే
34
ఎందుకు ఇల్లు కట్టకూడదు
Image Credit : Getty

ఎందుకు ఇల్లు కట్టకూడదు

నేటి కాలంలో పిల్లలు చదువు, ఉద్యోగాల కోసం పెద్ద నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కట్టిన ఇళ్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. మీ పిల్లలు మీ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. అలాంటప్పుడు వారి జీవనశైలే మారిపోతుంది. మీరు కట్టిన ఇళ్లలో వారు ఉండకపోవచ్చు అని అన్నారు. తమ సంపాదన మొత్తం పిల్లల కోసం కట్టే ఇంటి పై ఖర్చు చేయకుండా.. పిల్లలకు విద్యా, నైపుణ్యాలు అందించేందుకు వారికి మంచి జీవిత సౌకర్యాల్ని ఇచ్చేందుకు వెచ్చించడం మంచిదని సూచించారు. ఇల్లు కట్టడం తప్పు కాదని.. కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఇల్లు కట్టాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు.

44
నిజమే కదా
Image Credit : Getty

నిజమే కదా

జస్వీర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిల్లల కోసం ఇల్లు కట్టి తల్లిదండ్రులు తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని పరోక్షంగా చెప్పినట్టు ప్రచారం జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో కూడా మిశ్రమంగా స్పందించారు నెటిజన్లు. కొంతమంది అది నిజమేనని ఒప్పుకున్నారు. మరికొందరు మాత్రం ఇల్లు అనేది కేవలం ఆస్తి కాదని. అది ఒక భద్రత అని వాదించారు. మధ్యతరగతి కుటుంబాల్లో సొంత ఇల్లు అనేది ఒక కల అని కామెంట్లు చేశారు. ఇల్లు కట్టకూడదనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యతిరేకించారు. జస్వీర్ సింగ్ చెప్పిన ప్రకారం ఇంటి కోసమే జీవితం మొత్తం ఈఎమ్ఐలు కడుతూ గడుపుతున్న తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అలాంటివారు నిర్ణయాన్ని తీసుకోకుండా ఆ డబ్బును పిల్లలకు మంచి విద్యను, స్కిల్స్ అందించడంలో ఖర్చుపెడితే మంచిదని అతని అభిప్రాయం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Petrol Price: మ‌రోసారి భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. లీట‌ర్ ధ‌ర ఎంత‌కు చేరిందో తెలుసా?
Recommended image2
షేర్ మార్కెట్లో రిస్క్, వడ్డీకిస్తే భయం.. ఏ టెన్ష‌న్ లేకుండా రూ. 15 లక్ష‌లు పెడితే నెల‌కు రూ. 9 వేలు వ‌చ్చే స్కీమ్
Recommended image3
Saving Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఎన్ని డ‌బ్బులు ఉండొచ్చు.? ఈ త‌ప్పులు చేస్తే ఇబ్బందులు త‌ప్ప‌వు
Related Stories
Recommended image1
Anchor Suma: సుమ గారి భర్త కాదు.. సుమ వదిలేసిన భర్త అనకుండా చూసుకో, రాజీవ్ కనకాలకు కౌంటర్
Recommended image2
Birth Date: ఈ తేదీలలో పుట్టిన వారికి విపరీతమైన ఇగో.. వీరితో స్నేహం, శత్రుత్వం రెండూ డేంజరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved