Zodiac Signs: ఈ ఆరు రాశులవారికి కోపం చాలా ఎక్కువ.. వీరితో జాగ్రత్తగా లేకపోతే కష్టం!
సాధారణంగా కొందరు వ్యక్తులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. మరికొందరు ఎప్పుడు చూసినా.. కోపంగానే కనిపిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 6 రాశులవారు చాలా కోపంగా ఉంటారట. వారి కోపాన్ని తట్టుకోవడం చాలా కష్టమట. మరి ఏ రాశులవారు ఇలా ఉంటారో ఓసారి చూసేయండి.

మేష రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్యంతో పాటు వీరికి కోపం కూడా ఎక్కువే. ఏ విషయంలోనూ ఈ రాశివారు వెనుకడుగు వేయరు. వారికి నచ్చని వాళ్ల గురించి ఎలాంటి మాటలు చెప్పడానికైనా వీరు వెనకాడరు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశి వారు కంఫర్ట్ కి ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ కంఫర్ట్ జోన్ దాటి బయటకురారు. ఒకవేళ రావాల్సి వస్తే.. వీరికి ఎక్కడలేని కోపం వస్తుంది. ఆ కోపాన్ని కూడా చాలా పద్ధతిగా చూపిస్తారు. అంతా త్వరగా ఆ విషయాన్ని వదిలిపెట్టరు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు చాలా ఎమోషనల్ పర్సన్. వీరు తమ భావాలను లోపలే దాచుకుంటారు. నిరాశను మాత్రం బయటకు వెల్లడిస్తారు. వీరి కోపం కారణంగా అందరికీ దూరంగా ఉంటారు.
సింహ రాశి
సింహ రాశి వారు చాలా మొండివారు. వీరికి ఓపిక చాలా తక్కువ. ఈ గుణాలు వారిపై ఎదుటి వ్యక్తులకు కోపం వచ్చేలా చేస్తాయి. ఎక్కడైతే.. వీరికి గౌరవం, గుర్తింపు దక్కదో వీరు అక్కడి నుంచి వెెళ్లిపోతారు. వారిపై కోపాన్ని పెంచుకుంటారు.
కన్య రాశి
కన్య రాశివారు తమ కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఈ రాశివారు ఎక్కువగా గొడవలు పడుతుంటారు. కొన్నిసార్లు వీరి ప్రవర్తన చూస్తే.. వారితో ఉండడానికి కూడా భయం వేస్తుంది. ఈ రాశివారు చిన్న తప్పులను సైతం సహించరు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. వీరు కోపాన్ని చాలా జాగ్రత్తగా వ్యక్తపరుస్తారు. ఏదైనా వారికి నచ్చని విషయం ఉంటే.. నిర్మోహమాటంగా నచ్చలేదని చెప్పేస్తారు. కోపాన్ని కంట్రోల్ చేసుకొని ముందుకు సాగడంలో వీరు ముందుంటారు.