- Home
- Astrology
- Zodiac Signs: ఈ 5 రాశుల వారు వజ్రాలు ధరిస్తే దురదృష్టం వెంటాడుతుంది, శుక్రుడు వీక్ అవుతాడు
Zodiac Signs: ఈ 5 రాశుల వారు వజ్రాలు ధరిస్తే దురదృష్టం వెంటాడుతుంది, శుక్రుడు వీక్ అవుతాడు
Zodiac Signs: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాశుల వారు వజ్రాలు ధరించడం ఏమాత్రం మంచిది కాదు. వీరికి వజ్రాలు ధరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. శుక్రుడి స్థానాన్ని బట్టి వజ్రాన్ని ధరించాలి.

వజ్రం ధరించకూడని రాశులు
వజ్రాలు ఎంతో విలువైనవి. ప్రతి ఒక్కరికి వజ్రపు ఉంగరం, వజ్రాల హారం, వజ్రాల ముక్కు పుడక వంటివి పెట్టుకోవాలని ఉంటుంది. అయితే అందరూ వజ్రం ధరించకూడదు. కొందరికి వజ్రం కలిసి రాదు. ఇది వారి అదృష్టాన్ని తగ్గించేస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం వజ్రం అనేది శుక్రుడికి సంబంధించిన రత్నం. మీ జాతకంలో శుక్రుడి స్థానం బట్టి వజ్రం పెట్టుకోవచ్చో లేదో తెలుసుకోండి. కొన్ని రాశుల వారికి వజ్రం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే శుక్రుడు వీక్ అవుతాడు.
మేష రాశి
మేష రాశికి అధిపతి కుజుడు. వజ్రం శుక్రుడికి సంబంధించిన రత్నం. కుజుడు, శుక్రుడు ఒకరికొకరు శత్రువుల్లా ప్రవర్తిస్తారు. అందుకే అవి శత్రు గ్రహాలుగా చెప్పుకుంటారు. కాబట్టి మేషరాశి వారు వజ్రం ధరించకూడదు. ఇలా ధరిస్తే జీవితంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు, శుక్రుడు సమ గ్రహాలు. అయినా కూడా సింహ రాశి వారు వజ్రం ధరించడం అంత మంచిది కాదు. ఇది అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇది అహంకారం, ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. కుజుడు, శుక్రుడు ఒకరికొకరు సరిపడరు. వీరు శత్రువుల్లా ఉంటారు. కాబట్టి ఈ రాశి వారు వజ్రం ధరించకూడదు. ఇది భావోద్వేగ అస్థిరతను, చేసే పనుల్లో నష్టాలు, వైవాహిక జీవితంలో సమస్యలు కలిగే అవకాశం ఉంది.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి అధిపతి గురువు. ఇక గురువు, శుక్రుడు ఒకరికొకరు శత్రువుల్లా ఉంటారు. కాబట్టి ధనుస్సు రాశి వారు వజ్రం ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే ఆర్థిక నష్టాలు, ఊహించని ఖర్చులు వచ్చిపడతాయి. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మీనం
మీన రాశి వారికి అధిపతి గురు గ్రహం. గురు గ్రహం, శుక్ర గ్రహం మధ్య శత్రుత్వం ఎక్కువ. అందుకే మీన రాశి వారు వజ్రం ధరించకూడదు. వజ్రం ధరిస్తే గందరగోళం, ఆర్థిక సమస్యలను తీసుకువస్తుంది. మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది.

