Mars Transit: కుంభరాశిలో రాహు కుజుల రుద్రతాండవం, 5 రాశుల వారికి ధన నష్టం
Mars Transit: కుంభరాశిలోకి పద్దెనిమిదేళ్ల తరువాత అంగారకుడు అడుగుపెట్టబోతున్నాడు. రాహువు కూడా ఆ రాశిలోకే ప్రవేశించి రాహు కుజ కలయికతో అంగారక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ధన నష్టం ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ యోగం ఏర్పడుతుంది.

వృషభ రాశి
ఫిబ్రవరిలో ఏర్పడే అంగారక యోగం వల్ల వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి పదవ ఇంట్లో కుజుడు సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఉద్యోగంలో లేదా వ్యాపారంలో, వీరు చేసే ఏ ముఖయమైన పనుల్లోనైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు తమ శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. లేకుంటే అవి నష్టాన్ని కలిగిస్తాయి. ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీరిలో మానసిక ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఏడవ ఇంట్లోకి కుజుడు ప్రవేశిస్తాడు. దీని వల్ల వీరికి ఊహించని విధంగా ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి తొందరపాటు నిర్ణయాలనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది.లేదంటే పెద్ద నష్టాలు తప్పవు. వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట, కార్యాలయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది మీలో ఒత్తిడిని పెంచుతుంది. ఆ ఒత్తిడిని భరించకతప్పదు. అంతే తప్ప ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఆరవ ఇంట్లో కుజుడు సంచారం జరుగుతుంది. ఆ సమయంలో అప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పులు చేయడం మానుకుంటే మంచిది. లేకుంటే తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో పడిపోతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి శత్రువులు చురుకుగా ఉంటారు. ఎంత కష్టపడినా ఫలితం రాదు. కష్టానికి తగిన ఫలం లేక ఈ రాశి వారిలో ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. సమాజంలో గౌరవం కూడా తగ్గే అవకాశం ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి అంగారక యోగం మొదటి ఇంట్లో ఏర్పడుతుంది. కుజుడు ఈ రాశి వారి మొదటి ఇంట్లోనే సంచరిస్తాడు. వీరు ఫిబ్రవరి నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కారు లేదా బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి, ఆర్థిక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీని వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది.
మీన రాశి
మీన రాశి వారి పన్నెండవ ఇంట్లో కుజుడి సంచారం ఉంటుంది. కాబట్టి వీరు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడపడితే అక్కడ పెట్టుబడులు పెట్టకూడదు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి. అధిక ఒత్తిడికి గురవ్వడం వల్ల నిద్రను తీవ్రంగా ప్రభావితం అవుతుంది.

