Berth in Train: రైలులో ఈ బెర్తుకే డిమాండ్ ఎక్కువ ఎందుకో తెలిస్తే మీరు కూడా కావాలంటారు
Berth in Train: దూర ప్రయాణాలు చేసేందుకు రైలు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే రైళ్లకు చాలా డిమాండ్ ఎక్కువ. టిక్కెట్లు దొరకడమే కష్టంగా ఉంటుంది. అయితే ప్రయాణికులు ఎక్కువగా ఒక బెర్తునే కోరుకుంటారు. దానికోసమే రైల్వే శాఖను రిక్వెస్ట్ కూడా చేస్తారు.

రైలు ప్రయాణం సూపర్
రైలు ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా, సుఖంగా ఉంటుందో అందులో ప్రయాణించే వారికి తెలుస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. బాత్ రూమ్ ఫెసిలిటీ, ఏసీలు, నిద్రపోవడానికి సరిపడా బెర్తులు ఉంటాయి. రైలులో స్లీపర్, ఏసీ, జనరల్ కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లలో దూర ప్రయాణాలు చేసే వారు స్లీపర్ లేదా ఏపీ కోచులు ఎంపిక చేసుకుంటారు. వీటిలో లోయర్, మిడిల్, అప్పర్, సైడ్ లోయర్, సైడ్ అప్పర్ బెర్త్‌లు ఉంటాయి. వీటిలో ఒక బెర్త్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. టిక్కెట్ ఆన్ లైన్లో బుక్ చేసేటప్పుడు అందరూ ఈ బెర్తు కావాలనే రిక్వెస్టు పెడతారు. రిక్వెస్టు పెట్టినంత మాత్రాన అవి వచ్చేయవు. లక్ ఉంటేనే వస్తాయి.
ఈ బెర్తుకే డిమాండ్
అందరూ అప్పర్ బెర్త్ కావాలని కోరుకుంటారని అనుకుంటున్నారా? ఇక్కడైతే ఎవరి ఇబ్బంది ఉండదు కాబట్టి ఎక్కువ ఇదే బెర్తు అడుగుతారు అని భావిస్తున్నారా? కానే కాదు. అధిక శాతం మంది ప్రయాణికులు ఇష్టపడేది లోయర్ బెర్త్. ఈ బెర్తు వస్తే పైకి ఎక్కి దిగాల్సిన అవసరం లేదు. వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లల తల్లులు, వికలాంగులు లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యం ఇస్తారు. వీరే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఈ బెర్తు కావాలనే కోరుకుంటారు. ఇలా కోరుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
అత్యంత సౌకర్యవంతమైన బెర్త్
దూర ప్రయాణం చేసేవారికి లోయర్ బెర్త్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. లోయర్ బెర్త్ వచ్చిన వారు హాయిగా బెర్తుపై కూర్చుని భోజనాలు చేయవచ్చు. అలాగే మిడిల్, అప్పర్ బెర్త్ ప్రయాణికులు కూడా కింద కూర్చుని భోజనం చేసే వీలుంటుంది. కిటికీ నుంచి బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆనందిస్తూ తినవచ్చు. స్లీపర్ బెర్తు ఉన్న వారికి కిటికీల నుచి మంచి గాలి వస్తుంది. పదేపదే పైకి ఎక్కాల్సిన, దిగాల్సిన అవసరం ఉండదు.
లగేజ్ చూసుకోవచ్చు
లోయర్ బెర్తు కిందే లగేజీలు పెట్టుకుంటారు. అవి సురక్షితంగా ఉన్నాయో లేదో పదే పదే చూసుకోవడానికి లోయర్ బెర్తు అనువుగా ఉంటుంది. ప్రయాణికులు తమ లగేజీని నేరుగా కింద ఉంచి దానిపై ఓ కన్నేసి ఉంచొచ్చు. కానీ అప్పర్ బెర్త్, మిడిల్ బెర్తులో ఉన్న వారికి ఈ సౌకర్యం లేదు. వారు తమ లగేజీ సురక్షితంగా ఉందో లేదో అని ఆందోళన చెందుతుంటారు. రెండు మూడు సార్లు దిగి లగేజీని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
లోయర్ బెర్త్ వస్తే ఎవరి సహకారం లేకుండా పడుకోవచ్చు, లగేజీ సర్దుకోవచ్చు. అలాగే సులువుగా బెడ్ సిద్ధం చేసుకోవచ్చు. రైల్వే శాఖ 60 ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, వికలాంగులు, గర్భిణులకు లోయర్ బెర్త్‌లకు ప్రాధాన్యత ఇస్తుంది. వీరికి లోయర్ బెర్తు ఇచ్చే అవకాశం ఉంది.
అత్యవసర పరిస్థితుల్లో అర్జెంటుగా దిగాలనుకుంటే లోయర్ బెర్త్ బెటర్. అందుకే ఈ బెర్త్‌లు ముందుగా నిండిపోతాయి. టికెట్ బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ చాలా త్వరగా బుక్ అయిపోతాయి. ఈ బెర్తు వస్తే సౌకర్యం, భద్రత రెండూ ఉంటాయి.

