18 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో బుధ, కేతువుల కలయిక.. మూడు రాశులకు అపార సంపద..!
జోతిష్యశాస్త్రం ప్రకారం, 18 సంవత్సరాల తర్వాత బుధుడు, కేతువులు ఒకే రాశిలో కలవనున్నాయి.ఈ రెండు గ్రహాల కలయిక మూడు రాశులకు స్వర్ణయుగం కానుంది. ఆదాయం పెరుగుతుంది.. కెరీర్ లో గ్రోత్ కనపడుతుంది.

zodiac signs
వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా మారుతూనే ఉంటాయి. ఆగస్టు 30వ తేదీన బుధ గ్రహం సింహ రాశిలోకి ప్రవేశిస్తోంది. అయితే.. ఆల్రెడీ కేతువు అదే గ్రహంలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక ఒకే రాశిలో జరగడం దాదాపు 18 సంవత్సరాల తర్వాత జరుగుతుండటం విశేషం. ఈ అరుదైన కలయిక.. కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు అందించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
మకర రాశి
కేతువు, బుధ గ్రహాల కలయిక మకర రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మకర రాశి వారికి ఆకస్మక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారం కూడా బాగా విస్తరించుకునే అవకాశం ఉంది. అదృష్టం బాగా పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ప్రియమైన వారితో ప్రయాణాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక శుభ ప్రభావాలను అందిస్తుంది. శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పెండింగ్ పనులు కూడా పూర్తి అవుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది.
2.సింహ రాశి...
బుధుడు-కేతువు కలయిక సింహ రాశివారికి చాలా అదృష్టాన్ని తెస్తాయి. మీ జాతకంలో మొదటి ఇంట్లో సంయోగం ఏర్పడుతుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీకు ఆనందం, అదృష్టం లభిస్తుంది. జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈ సమయం కెరీర్ పరంగా మంచిది. వ్యాపార భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వైవాహిక జీవితం సురక్షితంగా, స్థిరంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
3.ధనస్సు రాశి...
కేతువు , బుధ గ్రహాల కలయిక మీకు సానుకూల మార్పులను తెస్తుంది. ఎందుకంటే ఈ సంయోగం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతుంది. ధనుస్సు రాశి వారికి, కేతు-బుధ సంయోగం వివిధ వ్యాపారాల నుండి లాభాలను ఆర్జించడానికి అనువైన సమయం. ఈ సమయం పనిలో వివిధ ప్రాజెక్టులలో పాల్గొనడానికి శుభ సమయం అవుతుంది. చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే, అధికారులు , సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు, అవకాశాలు లభిస్తాయి. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త సంబంధాలు మంచి ఫలితాలను ఇస్తాయి.ఈ సమయంలో, మీరు ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.