MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అప్పుల నుంచి విముక్తి- భూమి, వాహనాల కొనుగోలు!

Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అప్పుల నుంచి విముక్తి- భూమి, వాహనాల కొనుగోలు!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 14.12.2025 నుంచి 20.12.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Dec 14 2025, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : AI

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాల ఏర్పడుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త… పైకి చాలా మంచివారిలా కనిపిస్తారు!
Related image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి మొండితనం ఎక్కువ.. భరించడం చాలా కష్టం!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషాన్నిస్తుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాల్లో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వారం చివరిలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కొన్ని పనులు చకచకా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ మీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ప్రత్యర్థులు కుడా సానుకూలంగా మారతారు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న పదవులు లభిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటా బయటా అందరు మీ మాటతో విభేదిస్తారు. సన్నిహితుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత వరకు బయటపడతారు. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సూచనలు పాటించడం మంచిది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థిరాస్థి వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సొంత ఆలోచనలు కలిసివస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు గుర్తుచేసుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. 

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సకాలంలో ఆప్తుల సహకారం అందుతుంది. సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి అందిన అరుదైన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలం.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు సంబంధించి అవరోధాలు అధిగమిస్తారు. ఇంటా బయటా పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపార ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. 

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వనాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు అనుకూలం. 

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త… పైకి చాలా మంచివారిలా కనిపిస్తారు!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారికి మొండితనం ఎక్కువ.. భరించడం చాలా కష్టం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved