Zodiac signs: ఈ రాశులవారు నిజాయితీకి మారుపేరు, ఒక్క అబద్ధం కూడా చెప్పరు
జోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారు ఇతరుల పట్ల చాలా నిజాయితీగా ఉంటారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా..

zodiac signs
జోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి రాశికీ ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారు చాలా నిజాయితీగా ఉంటారు. పొరపాటున కూడా అబద్ధం చెప్పరు.. ఇతరులను మోసం చేయాలనే ఆలోచన కూడా వారికి రాదు. మనసులో ఒకటి, బయటకు మరొకటి మాట్లాడే వ్యక్తిత్వం వీరిలో ఉండదు. మరి, ఆ రాశులేంటో చూద్దాం...
1.సింహ రాశి...
సింహ రాశిని సూర్యుడు పాలిస్తాడు. ఈ రాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అంతేకాదు.. వీరు చాలా నిజాయితీపరులు. చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. తమ మనసులో ఏముందో వెంటనే చెప్పేయగలరు. మనసులో ఒకటి పెట్టుకొని, బయటకు మరొకటి మాట్లాడరు. మనసులో ఏముందో.. అదే చెబుతారు. ఒకరి గురించి మరొకరితో.. సీక్రెట్స్ చెప్పడం, పుకార్లు సృష్టించడం వీరికి నచ్చదు. ఈ రాశివారు ఇతరులకు చాలా విలువైనదిగా భావిస్తారు. ఇతరుల నమ్మకాన్ని పెంచుకోవడంలో వీరు చాలా ముందుంటారు. అబద్ధాలు చెప్పరు. మోసం అసలే చేయరు.
2. తుల రాశి..
తులారాశి ని శుక్ర గ్రహం పాలిస్తుంది. ఈ రాశివారు సహజంగానే న్యాయంగా, సమతుల్యతను ఇష్టపడతారు. ఎవరికీ అబద్ధాలు చెప్పడం వీరికి నచ్చదు. అబద్దాలు చెప్పడం, వినడం రెండూ వీరికి నచ్చదు. నిజాలు మాత్రమే మాట్లాడి.. నమ్మకాన్ని పెంచుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు.
తులారాశి వారు చాలా కరుణా మయులు. ఇతరులను బాధపెట్టరు. కానీ సత్యాన్ని దాచడానికి బదులుగా, వారు దానిని సున్నితంగా, అందరికీ అర్థమయ్యేలా వివరిస్తారు. ఈ విధానం వారు ఇతరులతో నిజాయితీగా ఉండటానికి సహాయపడుతుంది.తులారాశి వారు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఇష్టపడతారు. వారు ఇతరులతో నిజాయితీగా ఉండటం ద్వారా ప్రతికూల పరిస్థితులను నివారిస్తారు.
3. ధనస్సు రాశి..
ధనుస్సును బృహస్పతి గ్రహం పాలిస్తుంది. వారు సహజంగా బహిరంగంగా ఉంటారు. సత్యాన్ని దాచడం అసాధ్యం. వారు తమ మనసులో ఉన్నదాన్ని నేరుగా, సంకోచం లేకుండా వ్యక్తపరుస్తారు, ఇది వారు ఇతరులతో నిజాయితీగా ఉండటానికి ప్రధాన కారణం. వీరికి అబద్ధాలు చెప్పడం అంటే చాలా అసహ్యం. వీరు అబద్ధాలు చెప్పరు.. ఇతరులు చెప్పినా అసహ్యించుకుంటారు. అంతేకాదు.. ఈ రాశివారు స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడతారు. అబద్ధం స్వేచ్ఛను హరిస్తుందని వీరు భావిస్తారు. అందుకే వీరు ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడతారు.