Sun Blessed Zodiac signs: సూర్యుడి అనుగ్రహం పొందే 3 రాశులు ఇవే, రాజభోగాలు అనుభవిస్తారు
Sun Blessed Zodiac signs: సూర్యుడికి ఇష్టమైన రాశులు మూడు ఉన్నాయి. ఆ 3 రాశుల వారికి సూర్యుడంటే కూడా చాలా ఇష్టం. సూర్యుడిని గ్రహాలకు రాజుగా చెప్పుకుంటారు. మూడు రాశుల వారికి సూర్యుడు రాజభోగాలు అందిస్తాడు.

సూర్యుడికి ఇష్టమైన రాశులు
సూర్య భగవానుడు బలంగా ఉంటే ఏ వ్యక్తి అయినా రాజపూజ్యం అందుకుంటారు. సూర్యుడిని పూజించడం వల్ల కీర్తి, సంపదలు కలుగుతాయని చెబుతారు. సూర్యుడి ఆశీస్సులు ఉన్న వ్యక్తికి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అయతే జీవితంలో సూర్య భగవానుడి అనుగ్రహం ఉన్న రాశుల కొన్ని ఉన్నాయి. వారు జీవితంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు. సూర్య భగవానుడికి ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రంలో 12 రాశులు ఉంటే.. ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్ట రాశితో సంబంధం ఉంటుంది. వారు మాట్లాడే, ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని శక్తి, గౌరవం, ఆత్మవిశ్వాసానికి కారకుడిగా భావిస్తారు.
మేష రాశి
జ్యోతిషశాస్త్రం ప్రకారం మేషరాశి వారంటే సూర్యుడికి ఎంతో ఇష్టం. అలాగే మేష రాశి వారికి కూడా సూర్యుడంటే చాలా ప్రేమ, సూర్యుడి ఆశీస్సుల వల్ల మేషరాశి వారు ఎంతో గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. మేష రాశివారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వీరికి సమాజంలో అపారమైన గౌరవాన్ని కూడా పొందుతారు.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశిలో పుట్టినవారిపై సూర్యుడికి ఎంతో అనుగ్రహం ఉంటుంది. ఈ రాశిలో పుట్టినవారు ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు రావు. వ్యాపారం చేస్తున్న వారికి కచ్చితంగా విజయం దక్కుతుంది. ఈ వ్యక్తులు తమ ఉద్యోగాలును పూర్తి చేయడంలో నిపుణులుగా ఉంటారు. సింహరాశి వారు తమ కష్టంతో జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.
ధనూ రాశి
ధనుస్సు రాశికి అధిపతి గురు గ్రహం. నిజానికి ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. వీరు వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చదువైనా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ వ్యక్తులకు తెలివి తేటలు కూడా ఎక్కువ. ఈ రాశి వారికి సూర్యుడి అనుగ్రహం వల్ల డబ్బుకు లోటు ఉండదు.

