జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో అరుదైన కలయిక జరగబోతోంది. శని, రాహు, కేతు గ్రహాలు తమ సొంత నక్షత్రాల్లోకి సంచరించనున్నాయి. దీనివల్ల 5 రాశులవారికి మేలు జరగనుంది. సంతోషం, సంపద రెట్టింపు కానున్నాయి. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా..
Saturn Rahu Ketu Transit 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహు, కేతువు, శని గ్రహాలు అరుదైన కలయికకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రాహువు తన సొంత నక్షత్రమైన శతభిషంలో, శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉన్నారు. మార్చి 23న కేతువు కూడా తన సొంత నక్షత్రమైన మఖ నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ మూడు గ్రహాలు తమ సొంత నక్షత్రాల్లో ఉండటం వల్ల ఐదు రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. మరి ఆ రాశులేవో, వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందామా…
3 గ్రహాల సంచారం వల్ల లాభం పొందే రాశులు
మేష రాశి
మేషరాశివారికి చేసే పనిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు. సమాజంలో పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి.
సింహ రాశి
సింహ రాశివారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఎదుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం కలిసిరావడంతో చాలా పనులు సులభంగా పూర్తవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి ఆర్థికంగా, వృత్తిపరంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలలో చర్చలు, పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలు ద్వారా లాభం పొందే అవకాశం ఉంది. పూర్వీకుల ద్వారా ఆస్తి లాభం పొందే సూచనలు ఉన్నాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశివారికి శని, రాహు, కేతు గ్రహాల మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారాలలో ఎప్పుడూ చూడని లాభాలు చూస్తారు. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది.
మకర రాశి
మకర రాశివారికి ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. మీ కెరీర్ లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. ఆదాయం స్థిరంగా పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది.


