Birth Date: ఈ తేదీలలో జన్మించినవారు కచ్చితంగా గొప్పవారై తీరుతారు
Birth Date: న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు. వారి ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుంది. ఆ వ్యక్తులు కచ్చితంగా గౌరవాన్ని పొందుతారు.

ఏ తేదీలలో జన్మించినవారు?
సంఖ్యా శాస్త్రం లేదా న్యూమరాలజీ దీని ప్రకారం ఒక వ్యక్తి పెద్ద వయస్సులో ఎలాంటి జీవితాన్ని గడుపుతారో, ఏం సాధిస్తారో అంచనా వేసి చెప్పవచ్చు. అలాగే కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తులకి కొన్ని శక్తులు కూడా ఉంటాయి. న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలలో జన్మించిన వ్యక్తులు పెద్దయ్యాక సమాజంలో విపరీతమైన గౌరవాన్ని పొందుతారు. గొప్పవారు అవుతారు. అలాంటి జన్మ తేదీల గురించే ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాం. అవి ఏ నెలలోనైనా 1,10, 19,28 ఈ తేదీలలో జన్మించిన వ్యక్తుల పై సూర్యుని ప్రభావం ఎక్కువ. సూర్యుడు ఆత్మవిశ్వాసం, నాయకత్వం, గౌరవం, కీర్తిని సూచిస్తాడు.
ధైర్యం ఎక్కువ
1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 1 అవుతుంది. 1 రాడిక్ సంఖ్య కలిగిన వ్యక్తులు సహజంగానే ఆత్మవిశ్వాసం అధికంగా కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వం కూడా చాలా బలంగా ఉంటుంది. వీరు త్వరగా ప్రజల్ని ఆకట్టుకుంటారు. అలాగే ఇతరుల చేత గౌరవాన్ని పొందుతారు. వీరు నిరంతరం జీవితంలో ఉన్నత స్థానాలను సాధిస్తూనే ఉంటారు. వీరికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. వీరు ధైర్యవంతులు, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు.
ఒకటి మూల సంఖ్య కలిగిన వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ వదులుకోరు. ఏ స్థితిలోనైనా తమను తాము ప్రేరేపించుకుంటారు. ఎక్కడికి వెళ్లినా నాయకత్వ పాత్రనే పోషిస్తారు. వీరికి ఆత్మగౌరవం కూడా బలంగా ఉంటుంది. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి వీరికి ఉంటుంది.
కెరీర్ లో దూసుకెళ్తారు
ఈ తేదీలో జన్మించిన వ్యక్తులు కెరీర్లో కూడా వేగంగా అభివృద్ధి చెందుతారు వ్యాపారవేత్తలుగా రాజకీయ నాయకులు ప్రముఖులుగా ఎదుగుతారు వారి విశ్వాసం నిర్ణయం తీసుకునే శక్తి వారిని ఉన్నత స్థానాలకు నడిపిస్తుంది సమాజంలో వీరికి గౌరవం ఎక్కువ ప్రజలు వీరి మాట వెంటనే వింటారో సలహాలకు విలువ ఇస్తారు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక ముద్ర వేయడం వీరి అదృష్టం వీరు కీర్తి ఖ్యాతి ఎంతో దూరం వరకు వ్యాపిస్తుంది
వీరు ధనవంతులు
సూర్యుని ఆశీర్వాదం వల్ల వీరి ఆర్థికంగా ఎప్పుడు సంపన్నంగానే ఉంటారు. కష్టపడి పని చేయడం, తెలివితేటలతో పనిచేయడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. అలాగే డబ్బును జాగ్రత్తగా మేనేజ్ చేస్తారు. అలాగే ఆరోగ్యంగా ఉంటారు. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుకుంటారు. ఇక అనుబంధాలలో గౌరవప్రదంగా బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు ఉన్న కుటుంబం శాంతి, ఆనందంతో నిలిచి ఉంటాయి. వారు తమ జీవిత భాగస్వామి పిల్లలతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఒకటవ మూల సంఖ్య కలిగిన వ్యక్తులు ఎప్పటికైనా అదృష్టవంతులే. అయితే చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఆ విజయాలను మరింతగా పెంచుకోవచ్చు. ఇందుకోసం సూర్య భగవానుడిని రోజూ పూజించాలి. ఆదివారం బెల్లం, గోధుమలు దానం చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి.

