Surya Gochar: భరణి నక్షత్రంలోకి సూర్యుడు, ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే
Surya Gochar: సూర్యుడు అతిత్వరలో భరణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అక్కడ 15 రోజులు ఉంటాడు. దీని వల్ల నాలుగు రాశుల వారికి బాగా కలిసివస్తుంది. వారు ఏ పని చేసినా విజయమే దక్కుతుంది. ఆ 4 రాశుల్లో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.

మేష రాశి
మేష రాశి వారికి సూర్య సంచారం విపరీతంగా కలిసివస్తుంది. ఈ 15 రోజులు వీరికి ఎంతో కలిసివచ్చే కాలం. వీరు ఇల్లు లేదా కారు కొనాలనుకుంటే ఆ కల తీరిపోతుంది. పాత అప్పులు కూడా చాలా వరకు తీర్చేస్తారు. సంపద, సమాజంలో గౌరవం పెరుగుతాయి. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయం. కుటుంబ సమస్యలు తగ్గి ప్రశాంతంగా జీవితం గడుస్తుంది.
సింహ రాశి
సింహ రాశికి అధిపతి సూర్యుడు. సూర్య సంచారం సింహ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారు ప్లాన్ చేసుకున్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ప్రయాణాలు చేయాలనుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఇక ఈ రాశిలో వ్యాపారస్తులు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రాశి వారి కుటుంబ అవసరాలు తీరతాయి. తల్లిదండ్రులు, పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తులా రాశి
తులా రాశికి అధిపతి శుక్రుడు. శివునికి ఎంతో ఇష్టమైన రాశి ఇది. అందుకే వీరికి ప్రత్యేక ఫలితాలు దక్కుతాయి. శివుని ఆశీస్సులతో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సంపదతో పాటు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి సొంతమవుతుంది. ఈ 15 రోజుల కాలం వీరికి తిరుగే ఉండదు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి సూర్యుడు భరణి నక్షత్రంలో అడుగపెట్టడం బాగా కలిసివస్తుంది. ఈ సమయంలో ఎదుర్కొంటున్న అనేక వివాదాలు, సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మే 11 లోపు శుభవార్త అందే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలుంటే, చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా పెద్ద పనులపై దృష్టి పెట్టాలి. స్నేహితులతో సమయం గడపడం వల్ల మీకు మంచి ఉపశమనం, ఉత్సాహం లభిస్తాయి.

