MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!

AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!

AC rent Business: మండే ఎండల్లో ఏసీ కచ్చితంగా ఉండాల్సిందే. ఈ కాలంలో రూమ్ చల్లగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ సమయంలో పోర్టుబల్ ఏసీ అద్దెకిచ్చే వ్యాపారం మొదలుపెడితే సైడ్ ఇన్ కమ్ సంపాదించుకోవచ్చు.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 24 2026, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వేసేవిలో బెస్ట్ బిజినెస్
Image Credit : Gemini

వేసేవిలో బెస్ట్ బిజినెస్

వేసవిలో ఎండలు భరించలేక ఏసీలు, కూలర్లు కొనుక్కుంటూ ఉంటారు. కానీ చాలామంది విద్యార్థులు, అద్దె ఇళ్లలో ఉండేవాళ్లు, చిన్న షాపుల వాళ్లు శాశ్వతంగా ఏసీని పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్లు నివాస ప్రాంతాన్ని తరచూ మారుస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్లకు పోర్టబుల్ ఏసీలను అద్దెకిస్తే రెండు నెలల పాటూ వారు మీకు అద్దె చెల్లిస్తారు. ఇది వేసవిలో మాత్రమే నడిచే బెస్ట్ బిజినెస్. నెలకు సులువుగా సంపాదించుకోవచ్చు.  దీని కోసం మీరు రెండు నుంచి మూడు పోర్టబుల్ ఏసీలు కొని కొన్ని నెలల పాటు చల్లదనం కావాలనుకునే వారికి అద్దెకు ఇవ్వాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ ఏసీ ధరలు ఎంతుంటాయి?
Image Credit : Gemini

ఈ ఏసీ ధరలు ఎంతుంటాయి?

మార్కెట్లో ఒక మంచి పోర్టబుల్ ఏసీ ధర 18,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇంకా మంచిది కావాలంటే 22,000 రూపాయల దాకా ఖర్చుపెట్టాలి.  ఒక పోర్టబుల్ ఏసీకి నెలకు రూ.2,500 నుంచి రూ.4,000 అద్దెకు ఇవ్వచ్చు.  నాలు నెలల పాటు ఏసీని అద్దెకు ఇచ్చినా, ఒక మెషీన్‌పై సుమారు ₹12,000 నుంచి ₹15,000 సంపాదించవచ్చు. రెండో ఏడాది నుంచి మీ ఖర్చు వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేదంతా మీకు లాభమే.

34
పోర్టబుల్ ఏసీ ఎందుకు బెటర్?
Image Credit : meta ai

పోర్టబుల్ ఏసీ ఎందుకు బెటర్?

సాధారణ ఏసీతో పోలిస్తే పోర్టబుల్ ఏసీ చాలా బెటర్. దీన్ని గోడకు బిగించాల్సిన పనిలేదు. కాబట్టి పగలడం లాంటి ప్రమాదం ఉండదు. మెయింటెనెన్స్ కూడా చాలా సులువు. ఈ రోజుల్లో చాలామంది భారీ ఇన్‌స్టాలేషన్ తలనొప్పుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు. అందుకే రెంటింగ్ ట్రెండ్ పెరుగుతోంది. ఈ పనిని మీరు మీ ఇంటి నుంచే లేదా ఎక్కడి నుంచైనా మొదలుపెట్టొచ్చు.

44
ఎలా అద్దెకివ్వాలి?
Image Credit : chat GPT

ఎలా అద్దెకివ్వాలి?

పోర్టబుల్ ఏసీని అద్దెకు ఇచ్చేందుకు OLX, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో మీ ఏసీ ఫోటోలు పెట్టాలి. అలాగు అద్దె ఖర్చు వివరాలు, మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి.  పీజీలు, హాస్టళ్లలో మీ బిజినెస్ గురించి ప్రచారం చేయాలి. వారికే వీటి అవసరం అధికంగా ఉంటుంది.  ఎవరికైనా ఏసీ అద్దెకు ఇచ్చేటప్పుడు, వారి నుంచి ఒక ఐడీ ప్రూఫ్ (ఆధార్ కార్డ్), సెక్యూరిటీ డిపాజిట్ (అడ్వాన్స్ డబ్బు) తప్పకుండా తీసుకోండి. దీనివల్ల మీ వస్తువు సురక్షితంగా ఉంటుంది, మీకు సమయానికి డబ్బులు వస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Birth date: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల భవిష్యత్తును బంగారు కలంతో రాసాడు ఆ బ్రహ్మ
Recommended image2
Saree Markets: చవకగా చీరలు దొరికే హోల్‌సేల్ శారీ మార్కెట్లు ఇవిగో, రూ.150కే అదిరిపోయే చీరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved