MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Planets Retrograde: 4 గ్రహాల వక్రగమనం.. అదృష్టం మొత్తం ఈ 6 రాశులదే.. డబ్బే డబ్బు!

Planets Retrograde: 4 గ్రహాల వక్రగమనం.. అదృష్టం మొత్తం ఈ 6 రాశులదే.. డబ్బే డబ్బు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది (2026) లో 4 ప్రధాన గ్రహాల వక్ర సంచారం జరగనుంది. దానివల్ల కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఏ రాశులవారిని అదృష్టం వరించనుందో చూద్దామా..

2 Min read
Author : Kavitha G
Published : Mar 03 2026, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
4 గ్రహాల వక్రగమనం
Image Credit : stockPhoto

4 గ్రహాల వక్రగమనం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల వక్రగమనం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రస్తుతం గురువు వక్రగమనంలో ఉండగా, మార్చి 20 వరకు బుధుడు వక్రగమనంలో ఉంటాడు. ఈ గ్రహాలతో పాటు రాహువు, కేతువు కూడా వక్రగమనంలో ఉంటారు. ఈ 4 గ్రహాల వక్రగమనం 6 రాశులవారికి ఊహించని లాభాలు తెచ్చిపెట్టనుంది. ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

4 ప్రధాన గ్రహాల సంచారం వల్ల వృషభ రాశి వారి వ్యక్తిగత జీవితం, కెరీర్, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో ఊహించని బాధ్యతలు, జీతం పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం, విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం పొందుతారు. ఆహారం, ప్రయాణం విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

37
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

మిథున రాశి వారికి గురు, బుధ గ్రహాల వక్ర సంచారం వల్ల ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. విదేశీ పరిచయాలు, విదేశీ సంబంధిత ఆదాయానికి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసొచ్చే సూచనలున్నాయి. అయితే, ఈ రాశి అధిపతి బుధుడు కాబట్టి,  బుధ గ్రహ సంచారం వల్ల విలాసవంతమైన జీవితం, వ్యసనాలకు అలవాటుపడే ప్రమాదం ఉంది.

47
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి గురు, బుధ గ్రహాల సంచారం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి, కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. రాహు, కేతువుల ప్రభావంతో జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. విదేశీ పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది.

57
తుల రాశి
Image Credit : Getty

తుల రాశి

తుల రాశి వారికి గురు, బుధ గ్రహాల సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు, ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. డబ్బుకు సంబంధించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. రాహు, కేతువుల సంచారంతో జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు.

67
ధనుస్సు రాశి
Image Credit : Getty

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి గురు, బుధ గ్రహాల సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. కెరీర్, ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోయి, ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. రాశి అధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉండటం వల్ల దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

77
కుంభ రాశి
Image Credit : Getty

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ నాలుగు గ్రహాల సంచారం వల్ల అదృష్టం బాగా కలిసివస్తుంది. ఆదాయం పెంచుకోవడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఫలిస్తుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం పొందుతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి దూరప్రాంతాల నుంచి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!
Related Stories
Recommended image1
Sun Transit: మీన రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!
Recommended image2
Holi 2026: హోలీ పండగ నుంచి ఈ 4 రాశులవారి జీవితం మారిపోవడం పక్కా.. అన్నీ శుభవార్తలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved