- Home
- Astrology
- Astrology: ఈ 3 రాశుల వారు నక్క తోక తొక్కినట్లే.. శని తిరోగమనంతో మారనున్న జీవితం
Astrology: ఈ 3 రాశుల వారు నక్క తోక తొక్కినట్లే.. శని తిరోగమనంతో మారనున్న జీవితం
జ్యోతిష్య శాస్త్రంలో శనికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శని గ్రహంలో వచ్చే మార్పులు మన జాతకంపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతుంటారు. అలాంటి మార్పుతో తాజాగా 3 రాశుల వారి జీవితంలో కీలక మార్పులు జరగనున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శని తిరోగమనం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శనిదేవుడు న్యాయ పరిపాలకుడిగా భావిస్తారు. నవగ్రహాల్లో అతని స్థానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నెమ్మదిగా కదిలే శని, ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు గడుపుతాడు. అలాగే ఒక్కో నక్షత్రంలో 400 రోజులు ఉండే శనిదేవుడు తన తిరోగమన ప్రయాణాన్ని ప్రారంభిస్తే, అది 12 రాశులపైనా ప్రభావాన్ని చూపుతుంది.
శని రాశి మార్పు
ప్రస్తుతం శని మార్చి 29 నుంచి మీన రాశిలో ప్రయాణిస్తున్నారు. అయితే జూలైలో, దాదాపు 30 ఏళ్ల తర్వాత తిరోగమన దశలోకి ప్రవేశించబోతున్నారు. శని తిరోగమనం అనేది ప్రతి రాశిపై వేర్వేరు విధాలుగా ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రాశులకు ఇది అదృష్టాన్ని, ధనప్రాప్తిని కూడా తీసుకురావచ్చని అంటున్నారు. ముఖ్యంగా 3 రాశుల వారి జీవితంలో ఊహించని మార్పు జరగనుంది.
కర్కాటక రాశి
శని దేవుడు కర్కాటక రాశిలో తొమ్మిదవ ఇంట్లో తిరోగమనం చేస్తాడు. దీని ప్రభావంగా ఈ రాశి వారికి అదృష్టం మెండుగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోళ్లకు అనుకూల సమయం. కొత్త ఇల్లు, వాహనం కొనాలనే ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.
కుంభ రాశి
కుంభ రాశిలో రెండవ ఇంట్లో శని తిరోగమనంలో ఉండటం వల్ల వీరి మాటల్లో బలం పెరుగుతుంది. ఇతరులను ప్రభావితం చేయడం వంటి లక్షణాలు పెరుగుతాయి. ఎటువంటి పనులు మొదలుపెట్టినా విజయవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం, సంపద పెరుగుతుంది.
మిథున రాశి
పదవ ఇంట్లో శని తిరోగమనంలో ఉన్నందున, మిధున రాశి వారికి ప్రత్యేకంగా వ్యాపార రంగంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉన్న వ్యాపారంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. సంపాదనలో గణనీయమైన పురోగతిని చూడవచ్చు.