Vastu Tips: ఈ తప్పులు చేస్తున్నారా.. ఇంట్లో డబ్బు అస్సలు నిలవదట..
Vastu: నేటీకాలంలో డబ్బు చాలా ముఖ్యం. డబ్బు లేకుంటే ఎలాంటి పని చేయలేం. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉన్నవారికే సమాజంలో గౌరవం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని చోట్ల డబ్బులు పెట్టకూడదు. ఇలా చేస్తే డబ్బు కొరత ఏర్పడి బికార్లుగా మారుతున్నారంట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
డబ్బులు దాచిపెట్టడానికి నియమాలు
వాస్తు శాస్త్రంలో ప్రతిదానికీ నియమాలు ఉన్నాయి. డబ్బులు దాచి పెట్టడానికీ నియమాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు డబ్బులను తప్పుడు చోట పెడితే.. పేదరికంలో పడుతారు. మరి ఇంట్లో డబ్బులను ఎక్కడ పెట్టకూడదో చూద్దాం..
చీకటి ప్రదేశంలో పెట్టకూడదు
ఇంట్లో డబ్బులను ఎప్పుడూ చీకటి ప్రదేశంలో పెట్టకూడదు. మీరు డబ్బులను పెట్టాలనుకుంటే వెలుతురు ఉన్న చోట పెట్టండి. చీకటిగా ఉన్న చోట పెట్టకండి.
బాత్రూమ్ లో పెట్టకూడదు
డబ్బులను ఎప్పుడూ బాత్రూమ్ దగ్గర పెట్టకూడదు. బాత్రూమ్ నుండి నెగటివిటీ ఎక్కువగా వస్తుంది. కాబట్టి దాని దగ్గర డబ్బులు పెట్టకూడదు. దీనివల్ల పేదరికంలో పడతారు.
లక్ష్మీదేవికి ప్రతీరూపం
ఎప్పుడూ డబ్బులను శుభ్రమైన చోట పెట్టండి. ఎప్పుడూ మురికి ప్రదేశంలో డబ్బులను పెట్టకూడదు. డబ్బు అంటే లక్ష్మీదేవి, మురికి ప్రదేశంలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. కాబట్టి అలాంటి చోట డబ్బులు పెట్టకండి.
వాటికి దూరంగా
అంతేకాకుండా మీరు డబ్బులు పెట్టే చోట చీపురు పెట్టకండి. చీపురు అంటే ఇంటిని శుభ్రం చేసే వస్తువు, దాని దగ్గర డబ్బులు పెట్టకండి.
అలా చేస్తే ఆర్థిక సమస్యలు
చివరగా చెప్పాలంటే ఎవరైనా మీకు ఏదైనా వస్తువులు బహుమతిగా ఇస్తే, అలాంటి వస్తువులతో పాటు డబ్బులు పెట్టుకోకండి. దీనివల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అంతేకాదు మీరు బికారి అయ్యే అవకాశం కూడా ఉంది.