Shani Rahu Conjuction: శని, రాహు కలయిక, ఈ మూడు రాశులకు గోల్డెన్ టైమ్
ఒక్కోసారి.. రెండు లేదా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలుస్తూ ఉంటాయి. ఇలా అరుదన కలయిక ఏర్పడినప్పుడు కొన్ని రాశులకు ఊహించనంత మంచి జరిగితే, మరి కొన్ని రాశులకు బ్యాడ్ టైమ్ మొదలౌతుంది.

వేద జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తరుచూ కదులుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక్కో రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెడుతూ ఉంటాయి. ఏదైనా రాశిలోకి అడుగుపెడితే ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం పాటు అదే రాశిలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి.. రెండు లేదా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలుస్తూ ఉంటాయి.
ఇలా అరుదన కలయిక ఏర్పడినప్పుడు కొన్ని రాశులకు ఊహించనంత మంచి జరిగితే, మరి కొన్ని రాశులకు బ్యాడ్ టైమ్ మొదలౌతుంది. ఇలాంటి అరుదైన కలయికే ఈ నెలలో ఏర్పడనుంది. రాహువు, శని ఒకే రాశిలో కలుసుకోనున్నాయి. దీని వల్ల మూడు రాశులకు గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవుతుందట. మరి, ఆ లక్కీ రాశులేంటో చూద్దాం..
telugu astrology
1.వృషభ రాశి..
శని, రాహువు కలయిక వృషభ రాశివారికి చాలా మేలు చేయనుంది. వారి లైఫ్ లో గోల్డెన్ టైమ్ మొదలౌతుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. ఆగిపోయాయి అనుకున్న పనులు మళ్లీ పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు.కుటుంబంలో సంతోషం నెలకుంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రావచ్చు.
telugu astrology
తుల రాశి
తుల రాశి వారికి శని, రాహువుల కలయిక మంచి చేస్తుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. బంధువులతో సంబంధాలు బాగుంటాయి. వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగులకు మంచి సమయం. అదృష్టం కలిసివస్తుంది.
telugu astrology
మీన రాశి
మీన రాశి వారికి శని, రాహువుల కలయిక చాలా మంచిది. మే 18 ముందు జీవితంలో శుభ మార్పులుంటాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారులకు మంచి సమయం. కొత్త ప్రాజెక్టులు చేపడతారు, విజయం సాధిస్తారు. అనుకున్నవన్నీ సాధించగలుగుతారు.