MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Astrology
  • Shani Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

Shani Transit: రేవతి నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి!

Shani Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 17న శని గ్రహం, రేవతి నక్షత్రంలో సంచరించనుంది. ఈ గ్రహ మార్పు వల్ల కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశులేవో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : May 12 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రేవతి నక్షత్రంలో శని సంచారం
Image Credit : Asianet News

రేవతి నక్షత్రంలో శని సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో శని సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంది. మే 17న శని ఉత్తరాభాద్ర నక్షత్రం నుంచి రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. శని సంచారం వల్ల కొన్ని రాశులపై చెడు ప్రభావం పడనుంది. ముఖ్యంగా మేషం, కర్కాటకం, కుంభం, మీన రాశుల వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మరి ఏ రాశులవారికి ఎలాంటి సమస్యులుంటాయి? ఏ విషయాల్లో వారు మరింత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి- మాటల్లో జాగ్రత్త
Image Credit : Getty

మేష రాశి- మాటల్లో జాగ్రత్త

రేవతి నక్షత్రంలో శని సంచారం మేషరాశి వారికి మానసిక ఒత్తిడి, పనిభారాన్ని పెంచుతుంది. ఇప్పటికే ఏలినాటి శని ప్రభావంతో ఉన్న వీరికి, ఉద్యోగ, వ్యాపారాల్లో పోటీ పెరిగి ఒత్తిడి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా లక్కీ.. త్వరగా ధనవంతులు అవుతారు!
Related image2
Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా?
36
కర్కాటక రాశి- ఓపిక అవసరం
Image Credit : Pixabay

కర్కాటక రాశి- ఓపిక అవసరం

కర్కాటక రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళనలు పెరుగుతాయి. ఆఫీసులో సహోద్యోగులతో వాగ్వాదాలు జరగవచ్చు. కాబట్టి ఓపిక అవసరం. కొందరికి ఉద్యోగం మారాలనే ఆలోచనలు కూడా రావచ్చు. భావోద్వేగాలకు లోనై నష్టపోకుండా ఉండటం మంచిది. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి.

46
కుంభ రాశి- వ్యాపారాల్లో నష్టాలు
Image Credit : Pixabay

కుంభ రాశి- వ్యాపారాల్లో నష్టాలు

కుంభ రాశి వారికి శని సంచారం పరీక్ష పెడుతుంది. ఈ రాశి వారి ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో నష్టాలు రావచ్చు. పాత సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయటా ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో పై అధికారులతో గొడవలకు దూరంగా ఉండటం మంచిది. 

56
మీన రాశి- అనవసర ఖర్చులు
Image Credit : Getty

మీన రాశి- అనవసర ఖర్చులు

మీన రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో కొంత గంధరగోళ పరిస్థితులు ఉంటాయి. 

66
శని పరిహారాలు
Image Credit : Gemini AI

శని పరిహారాలు

పండితుల ప్రకారం శని ప్రభావం తగ్గించుకోవడానికి శనివారాల్లో శని దేవుడిని పూజించడం మంచిది. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు లేదా మినుములు దానం చేయడం శుభప్రదం. అలాగే రోజూ 108 సార్లు "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని జపించడం ద్వారా కూడా మానసిక ప్రశాంతత లభిస్తుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Shukra Gochar :సెప్టెంబర్ 11న స్వాతి నక్షత్రంలోకి శుక్రుడు..ఈ 3 రాశులకు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఈ 4 రాశులవారికి ఊహించని లాభాలు.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు చాలా లక్కీ.. త్వరగా ధనవంతులు అవుతారు!
Recommended image2
Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved