MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా?

Weekly Horoscope: ఈ వారం 12 రాశుల్లో ఏ రాశివారికి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసా?

Weekly Horoscope: ఈ వార ఫలాలు 10.5.2026 నుంచి 16.5.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

4 Min read
Author : Kavitha G
Published : May 10 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Asianet News

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులలో కొంత ఒత్తిడి, ఆలస్యం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకు అధిక పనిభారం తప్పదు. క్రమంగా పరిస్థితులు మెరుగవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కొంత ఆలస్యంగా ఫలితాలు ఇచ్చినా చివరికి మంచి ప్రయోజనం కలుగుతుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు.

Related Articles

Related image1
Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Related image2
Grahan Yoga: గ్రహణ యోగం.. ఈ 4 రాశుల వారికి కష్టాలు, కన్నీళ్లు తప్పవు..!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారికి ఈ వారం స్థిరత్వంతో పాటు మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాలలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారులకు ఇది లాభదాయకమైన వారం కావచ్చు. కొత్త ఒప్పందాలు, అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం మంచి ఏకాగ్రత ఉంటుంది, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలం. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం, నమ్మకం పెరుగుతాయి. కొన్ని పాత సమస్యలు పరిష్కారం అవుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారికి ఈ వారం కొంత సవాళ్లతో ప్రారంభమవుతుంది. పనిలో అనుకున్న ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. కమ్యూనికేషన్‌లో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మాటల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం ముఖ్యం. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రేమ సంబంధాల్లో స్పష్టత అవసరం, అనుమానాలు పెరగకుండా చూసుకోవాలి. వారం చివరికి పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశివారికి ఈ వారం చాలా సానుకూలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాలలో మీరు చేసే కృషికి మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఖర్చులు కూడా కొంతవరకు పెరగవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారికి ఈ వారం కొంత ఒత్తిడితో కూడిన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలలో కఠినమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. మీ సామర్థ్యాన్ని పరీక్షించే పరిస్థితులు వస్తాయి. కానీ ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దలతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మాటల్లో నియంత్రణ లేకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు. ఆరోగ్ అంతంతమాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు ఫోకస్ తగ్గే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఓపెన్ కమ్యూనికేషన్ అవసరం. వారం చివరికి పరిస్థితులు కొంత మెరుగవుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరు ద్వారా మంచి గుర్తింపు పొందుతారు. వ్యాపారులకు లాభదాయకమైన సమయం. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆదాయం పెరగవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం, నమ్మకం పెరుగుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారికి ఈ వారం కొంత ఒత్తిడితో ప్రారంభమవుతుంది. పనిలో అనుకున్న ఫలితాలు రావడానికి ఆలస్యం కావచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. కమ్యూనికేషన్‌లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఒత్తిడి, మానసిక అలసట బాధిస్తాయి. విద్యార్థులు కాస్త కష్టపడి చదవాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు రావచ్చు. వారం మధ్య నుంచి పరిస్థితులు మెరుగవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఈ వారం చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. కొత్త అవకాశాలు, ప్రమోషన్ సంబంధిత సూచనలు ఉన్నాయి. మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా లాభదాయకమైన వారం. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ సంబంధాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఆర్థికంగా.. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఈ వారం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా ఈ వారం బలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. పాత బాకీలు వసూలవుతాయి. అయితే ఖర్చులు కూడా కొంత పెరగవచ్చు. కుటుంబ జీవితంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలం. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి ఈ వారం కొంత సవాళ్లతో కూడిన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత ఆలస్యం జరగవచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటల్లో స్పష్టత అవసరం. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి బాధిస్తుంది. ప్రేమ సంబంధాల్లో అపార్థాలు రావచ్చు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. వారం చివరికి పరిస్థితులు కొంత మెరుగవుతాయి.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఆనందం, నమ్మకం పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా సులభంగా పరిష్కారమవుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Recommended image3
Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Related Stories
Recommended image1
Dream Astrology: పదే పదే ఈ కల వస్తే మీ జీవితం ఊహించని మలుపు తిరగడం ఖాయం!
Recommended image2
Grahan Yoga: గ్రహణ యోగం.. ఈ 4 రాశుల వారికి కష్టాలు, కన్నీళ్లు తప్పవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved