MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Saturn Transit: శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారి కలలు నెరవేరడం ఖాయం!

Saturn Transit: శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులవారి కలలు నెరవేరడం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా కర్మఫలదాత శని సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంది. త్వరలో శని రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దానివల్ల 4 రాశులవారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Feb 20 2026, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శని నక్షత్ర మార్పు
Image Credit : Asianet News

శని నక్షత్ర మార్పు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్మఫలదాత శని ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల వ్యక్తుల జీవితంలో కొత్త పాఠాలు, కొత్త అవకాశాలు, అనుకోని విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని గ్రహం మే 17న రేవతి నక్షత్రంలోకి ప్రవేశించి, అక్టోబర్ 9 వరకు అక్కడే సంచరించనుంది. ఈ సమయంలో శని శక్తి, రేవతి నక్షత్ర ప్రభావంతో పనిచేస్తుంది. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు. శని, బుధుల కలయికతో 4 రాశులవారికి మేలు జరగనుంది. ఆ రాశులేవో ఇక్కడ చూద్దాం. 

25
సింహ రాశి
Image Credit : Getty

సింహ రాశి

సింహ రాశి వారికి శని నక్షత్ర మార్పు.. జీవితంలో కీలక మార్పులను తీసుకువస్తుంది. తమ ప్రియమైన వారి నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులు కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Mars Transit: 5 రోజులు ఓపికపడితే చాలు.. ఈ 6 రాశులవారి సంపద రెట్టింపు కావడం ఖాయం!
Related image2
Venus Transit: కన్య రాశిలో రెండుసార్లు శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!
35
ధనుస్సు రాశి
Image Credit : AI Generated

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శని సంచారం ఆర్థిక పురోగతిని తీసుకువస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఎప్పటినుంచో ఉన్న కలలు నిజమవుతాయి. క్రమశిక్షణతో ముందుకు సాగితే స్థిరమైన ఆదాయం పెరిగే సూచనలు బలంగా ఉన్నాయి.

45
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారికి శని సంచారం అదృష్టాన్ని తీసుకువస్తుంది. పాత సమస్యల నుంచి నెమ్మదిగా బయటపడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు పొందే సూచనలు ఉన్నాయి. కెరీర్ స్థిరంగా, బలంగా ఉంటుంది. అయితే, ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ సహకారం, అన్నదమ్ముల మద్ధతు పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరిగి భవిష్యత్ కోసం బలమైన పునాది పడుతుంది.

55
వృషభ రాశి
Image Credit : getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని లాభ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా గణనీయమైన అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారాలు, పెద్ద సంస్థలతో ఒప్పందాలు, సానుకూల ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, రియల్ ఎస్టేట్, స్థిరాస్తి కొనుగోళ్లు లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. స్నేహితుల సహకారం ద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశముంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన పురుషులు రిచ్ డాడ్స్.. తమ పిల్లలకు కోట్ల విలువైన ఆస్తిని ఇస్తారు
Recommended image2
Birth Date: ఏ తేదీల్లో పుట్టిన వారు ఏం చేస్తే వారి అదృష్టం పెరుగుతుందో తెలుసా?
Recommended image3
Zodiac sign: ఈ రాశుల వారు ప్రేమ‌లో అబ‌ద్ధాలు చెబుతుంటారు? ఇంత‌కా రాశులేంటీ, ఎందుక‌లా చెప్తారు.
Related Stories
Recommended image1
Mars Transit: 5 రోజులు ఓపికపడితే చాలు.. ఈ 6 రాశులవారి సంపద రెట్టింపు కావడం ఖాయం!
Recommended image2
Venus Transit: కన్య రాశిలో రెండుసార్లు శుక్రుడి సంచారం.. ఈ 4 రాశులవారికి డబుల్ జాక్‌పాట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved