- Home
- Astrology
- Shani Vakri: శని వక్రసంచారం.. ఈ ఐదు రాశులకు పూర్వ వైభవం, కష్టం వారి గుమ్మం దగ్గరకు కూడా రాదు
Shani Vakri: శని వక్రసంచారం.. ఈ ఐదు రాశులకు పూర్వ వైభవం, కష్టం వారి గుమ్మం దగ్గరకు కూడా రాదు
Shani Vakri:శని కర్మ ప్రదాత, న్యాయ నిర్ణేతగా పిలుస్తారు. ఈ గ్రహం తన వక్ర సంచారం ప్రారంభించనున్నాడు. దీని వల్ల ఐదు రాశులకు స్వర్ణ యుగం రానుంది. పూర్వ వైభవం వీరికి తిరిగి లభించనుంది.

Shani Transit
జోతిష్యశాస్త్రం ప్రకారం, శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రస్తుతం శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. జులై 27, 2026 తర్వాత శని మళ్లీ వక్ర సంచారం మొదలుపెట్టనున్నాడు. శని భగవానుడి ఈ కదలిక కారణంగా, కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమౌతాయి. కాబట్టి, 2026లో తన కదిలికను మార్చుకోవడదం ద్వారా ఐదు రాశుల అదృష్టం రెట్టింపు అవుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...
శని కారణంగా ఈ రాశులకు రాజయోగం...
1.వృషభ రాశి....
2026 సంవత్సరంలో శని వక్ర సంచారం చేయడం వల్ల వృషభ రాశి వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో, ఉద్యోగం చేసే వృషభ రాశివారికి ఒక శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ రాశివారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతం కూడా పెరుగుతుంది. అదేవిధంగా, ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నట్లయితే.. శని భగవానుడి ప్రత్యేక అనుగ్రహం కారణంగా, ఈ కాలంలో మీరు గతంలో ఎన్నడూ సంపాదించనంత లాభం సంపాదించగలుగుతారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.
2.కన్య రాశి...
శని వక్ర సంచారం కన్య రాశివారి ఆదాయాన్ని రెట్టింపు చేయనుంది. కొత్త ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అందుబాటులో ఉన్నాయి. శని ప్రత్యేక అనుగ్రహం కారణంగా, అనేక లాభాలు పొందుతారు. వీరు కొంచెం కష్టం చేసినా.. ప్రతిఫలం రెట్టింపు పొందుతారు. ఆగిపోయిన అన్ని పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.
3.తుల రాశి..
శని వక్రీయ సంచారం కారణంగా తుల రాశి వారు రాబోయే ఆరు నెలల పాటు చాలా సంతోషంగా గడుపుతారు. విపరీతంగా డబ్బు కూడా సంపాదిస్తారు. శని శుభ దృష్టి మీ ఆర్థిక పరిస్థితిని బాగా బలపరుస్తుంది. కాబట్టి, మీరు ఏదైనా ఆస్తిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నా లేదా కొత్త అవకాశాలను పొందాలనుకుంటున్నా, ఈ కాలం మీకు చాలా బాగుంటుంది. శని అపారమైన అనుగ్రహం వల్ల, కార్యాలయంలో మార్పు లేదా బదిలీతో పాటు పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్భంలో, శని అనుగ్రహం వల్ల తులారాశి వారికి పొదుపు పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది.
ఈ రాశుల కష్టాలు తీరినట్లే...
మకర రాశి
మకర రాశికి అధిపతి శని. కాబట్టి, 2026లో శని సంచారం మీకు గరిష్ట ప్రయోజనాలను అందిస్తుంది. మీరు చాలా కాలంగా ధైర్యంతో చేసిన కఠోర శ్రమకు ఈ కాలంలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మకర రాశి వారికి ఈ సమయంలో అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి. శని వక్రగమనంలో ఉన్నప్పుడు, మకర రాశి వారికి కార్యాలయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల ఉన్నతాధికారులు మీ పట్ల ఆకర్షితులవుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారి పై శని దేవుని దృష్టి ఉంది. కాబట్టి, 2026 జూలైలో శని వక్రగమనం ప్రారంభించినప్పుడు, అదృష్టం పెరుగుతుంది. దీని వల్ల వీరి జీవితంలో ఆకస్మికంగా పెద్ద మార్పులు రానున్నాయి. శని దేవుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా ఈ రాశివారు సంపదను, ఐశ్వర్యాన్ని పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలను కనుగొంటారు. దీనితో పాటు, మీరు అనేక శారీరక , మానసిక ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు.

