Saturn retrograde : శని తిరోగమనం.. మూడు రాశుల లైఫ్ మొత్తం మారిపోనుంది..!
ఈ ఏడాది మార్చిలో కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెట్టిన ఈ శని... ఈ ఏడాది జులై 13వ తేదీన మరోసారి తిరోగమనం ప్రారంభించనుంది. ఇది దాదాపు 138 రోజులు సాగనుంది.

జోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే.. ఈ గ్రహం ఏదైనా రాశిలోకి అడుగుపెట్టింది అంటే రెండున్నర సంవత్సరాలపాటు అదే రాశిలో కంటిన్యూ అవుతుంది.మిగిలిన గ్రహాలు అంత ఎక్కువ సమయం తీసుకోవు. అంటే, ఈ శని గ్రహం ఈ ఎక్కువ సమయం ఉండటం వల్ల అది చూపించే ప్రభావం కూడా ఎక్కువ కాలం ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెట్టిన ఈ శని... ఈ ఏడాది జులై 13వ తేదీన మరోసారి తిరోగమనం ప్రారంభించనుంది. ఇది దాదాపు 138 రోజులు సాగనుంది.
ఈ 138 రోజుల పాటు కొన్ని రాశులపై శని ప్రభావం గట్టిగా చూపించనుంది. అయితే, మూడు రాశులకు మాత్రం అదృష్టాన్ని అందించనుంది. అంటే వారికి అనుకోని లాభాలు అందడంతో పాటు.. వారి జీవితంలో అన్నీ సానుకూల మార్పులు జరగనున్నాయి. మరి, శని తిరోగమనంతో శుభ ఫలితాలు అందుకోనున్న మూడు రాశులేంటో చూసేద్దామా..
telugu astrology
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ తిరోగమన కాలం ఆర్థికంగా మేల్కొలుపు నిస్తుంది. ప్రస్తుతంలో ఆర్థిక లాభాలు రావడమే కాకుండా, గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.సమాజంలో గౌరవం, కీర్తి పొందుతారు. అదృష్టం కూడా తోడై అనేక సమస్యల నుంచి బయటపడతారు. పనులలో స్పష్టత, నిర్ణయాలలో ధైర్యం కలుగుతుంది.
telugu astrology
మిథున రాశి
మీన్ రాశిలో శని తిరోగమనం మిథున రాశి వారికి కొత్త అవకాశాల బాటను తెరుస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం మార్చాలనుకుంటున్న వారికి మంచి ఛాన్సులు వస్తాయి.ఆర్థిక పరిస్థితులు బలపడతాయి. పెద్ద ఆశలు, కోరికలు ఈ సమయంలో నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.
telugu astrology
కన్యా రాశి
ఈ శని తిరోగమనం కన్యా రాశి వారికి ఉద్యోగరంగంలో మంచి మార్పులు తీసుకురానుంది. సహోద్యోగుల మద్దతుతో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి.వైవాహిక జీవితంలో సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. పార్ట్నర్‌తో పరస్పర అర్ధప్రాయంతో జీవితం మరింత బలపడుతుంది.