MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Astrology
  • Camel Statue: ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టడం వల్ల వాస్తు పరంగా కలిగే శుభ ఫలితాలు ఇవే

Camel Statue: ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టడం వల్ల వాస్తు పరంగా కలిగే శుభ ఫలితాలు ఇవే

Camel Statue: ఇంట్లో అలంకరణ కోసం ఎన్నో బొమ్మలు పెడుతూ ఉంటాము. వాస్తు ప్రకారం కొన్ని బొమ్మలు పెట్టడం వల్ల ఇంటి పరిస్థితి మారిపోతుంది. ఒంటె బొమ్మను పెట్టడం వల్ల ఆ ఇంట్లో శుభం జరుగుతుందని, పాజిటివ్ శక్తి ప్రసరిస్తుందని చెబుతోంది వాస్తు శాస్త్రం. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 23 2026, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వాస్తు ప్రకారం ఒంటె ఎందుకు?
Image Credit : Chat gpt

వాస్తు ప్రకారం ఒంటె ఎందుకు?

వాస్తు నిపుణులు చెబుతున్న ప్రకారం ఒంటె సహనానికి, స్థిరత్వానికి ప్రతీక. ఇది ఎన్నో కష్టాలను తట్టుకొని ముందుకు నడుస్తూ ఎడారిలో సాగుతూ ఉంటుంది. నీరు, ఆహారం లేకపోయినా దీర్ఘకాలం ప్రయాణం చేసే శక్తి దీనికి ఉంటుంది. అందుకే ఇంట్లో ఒంటె ప్రతిరూపం పెట్టుకుంటే సహనం, స్థిరత్వం, విజయం వంటివి కలుగుతాయని చెబుతారు. జీవితంలో సమస్యలు ఉన్నవారు కెరీర్, వ్యాపారంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఒంటె విగ్రహం వల్ల మానసిక ధైర్యం పెరగడంతో పాటు పాజిటివ్ ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏ దిశలో ఒంటె పెట్టాలి?
Image Credit : Getty

ఏ దిశలో ఒంటె పెట్టాలి?

ఒంటె విగ్రహం ఇంట్లో పెట్టేటప్పుడు సరైన దిశను కూడా ఎంపిక చేసుకోవాలి. ఉత్తర, పడమర దిశ ఈ విగ్రహానికి ఉత్తమంగా పరిగణిస్తారు. ఈ దిశలో ఉంచితే ఇంట్లో శుభశక్తి ప్రవహిస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయని అంటారు. అలాగే ఉత్తర లేదా తూర్పు దిశల్లో పెట్టినా కూడా సంపద, అభివృద్ధి పెరుగుతుందని చెబుతారు.

Related Articles

Related image1
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Related image2
Automatic Cars: ఆటోమేటిక్ కార్ కొనాలనుకుంటున్నారా? చవక ధరకే వచ్చే టాప్ 5 కార్లు ఇవిగో
34
ఏ గదిలో పెట్టాలి?
Image Credit : Getty

ఏ గదిలో పెట్టాలి?

ఇంట్లో ఏ గదిలో ఒంటె బొమ్మను ఉంచాలో కూడా వాస్తు శాస్త్రం ప్రకారం సూచనలు ఉన్నాయి. సాధారణంగా దీన్ని లివింగ్ రూమ్ లేదా డ్రాయింగ్ రూమ్ లో పెట్టడం మంచిది. ఇది ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అందంగా కనిపిస్తుంది. ఇంటి మొత్తం వాతావరణాన్ని పాజిటివ్ గా మార్చేస్తుంది. కానీ బెడ్ రూమ్, బాత్రూం మెట్ల కింద, నేలపైన నేరుగా ఉంచకూడదు. అలాంటి ప్రదేశాలలో ఒంటె బొమ్మ ఉంచడం శుభప్రదం కాదని చెబుతారు.

44
జంట విగ్రహాలు
Image Credit : Getty

జంట విగ్రహాలు

వాస్తు ప్రకారం ఒంటె విగ్రహాన్ని సింగిల్ గా కాకుండా జంటగా ఉంచడం మంచిదని వివరిస్తున్నారు. రెండు ఒంటెలు కలిసి ఉండటం వల్ల కుటుంబ, ఐక్యత, భాగస్వామ్య విజయాలు సూచిస్తుందని అంటారు. వ్యాపారం చేసేవారు కార్యాలయం లేదా ఇల్లు, పని ప్రదేశంలో ఒంటెల జంట విగ్రహం పెడితే అభివృద్ధి బాగా సాగుతుందని అంటారు. ఇక ఉద్యోగస్తులకు కెరీర్, పురోగతి కూడా సాగుతుంది. ఇక ఎలాంటి పదార్థంతో తయారుచేసిన ఒంటె విగ్రహాన్ని ఎంపిక చేసుకోవాలో కూడా తెలుసుకుంటే మంచిది. రాగి, పింగాణీ వంటి లోహాలతో తయారు చేసిన విగ్రహం శుభప్రదం. లేదా చెక్క, రాయి, రెసిన్ తో తయారైన విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. అయితే పగిలిన ఒంటె బొమ్మను మాత్రం ఇంట్లో ఉంచకూడదు. దుమ్ము పడిన ఒంటెను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. ఇక ఒంటె ముఖం పెట్టే దిశ కూడా ఎంతో ముఖ్యం. ఒంటె ముఖం ఇంటి లోపలికి చూస్తున్నట్టు ఉండాలి. ఇంటి నుంచి బయటకు చూస్తున్నట్టు ఉండకూడదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rahu Kuja Transit: ఈ 4 రాశుల వారు సరిగ్గా 17 రోజుల్లోపు శుభవార్త వినే అవకాశం, మీ రాశి ఉందా?
Recommended image2
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image3
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Related Stories
Recommended image1
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Recommended image2
Automatic Cars: ఆటోమేటిక్ కార్ కొనాలనుకుంటున్నారా? చవక ధరకే వచ్చే టాప్ 5 కార్లు ఇవిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved