MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Saturn Mercury Conjunction: బుధ, శని గ్రహాల అరుదైన యోగం.. ఈ 5 రాశులవారికి ఎన్ని లాభాలో!

Saturn Mercury Conjunction: బుధ, శని గ్రహాల అరుదైన యోగం.. ఈ 5 రాశులవారికి ఎన్ని లాభాలో!

Saturn Mercury Conjunction: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. త్వరలో గ్రహాల రాకుమారుడు బుధుడు, కర్మఫలదాత శని దేవుడి మధ్య నవపంచమ దృష్టి యోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన, శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 11 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శని బుధ గ్రహాల సంయోగం
Image Credit : Asianet News

శని బుధ గ్రహాల సంయోగం

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివి తేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. ఇక శని దేవుడిని కర్మ, ఓర్పు, కఠోర శ్రమ, దీర్ఘకాలిక విజయానికి ప్రతీకగా చెబుతారు. ఈ రెండు గ్రహాలు శుభ స్థానాల్లో సంచరించినప్పుడు, దాని ప్రభావం వ్యక్తుల జీవితంలోని అనేక అంశాలపై కనిపిస్తుంది. ఆగస్టు 17న బుధ, శని గ్రహాల మధ్య 120 డిగ్రీల దూరం ఏర్పడుతుంది. దీనివల్ల రెండు గ్రహాలు ఒకదానికొకటి నవమ-పంచమ దృష్టితో చూసుకుంటాయి. దీన్నే 'నవపంచమ దృష్టి యోగం' అని పిలుస్తారు. ఈ యోగం అత్యంత శుభప్రదమైంది. దీని ప్రభావంతో 5 రాశులవారికి విశేష ఫలితాలు ఉంటాయి. అవేంటో, ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మేష రాశి
Image Credit : Pixabay

మేష రాశి

మేష రాశి వారికి ఈ నవపంచమ దృష్టి యోగం కెరీర్‌లో కొత్త దారులు తెరుస్తుంది. కొత్త బాధ్యతలు, ముఖ్యమైన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుంది. అయితే పెద్ద పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ప్రేమ, వైవాహిక జీవితంలో విభేదాలు తగ్గి, భాగస్వామితో బంధం బలపడుతుంది.

Related Articles

Related image1
Love Marriage: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!
Related image2
Interesting Facts: వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా?
36
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశివారికి ఈ యోగం ఆదాయాన్ని పెంచే అవకాశాలను సృష్టిస్తుంది. మీ మాటతీరు, జ్ఞానం, నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగించుకుంటే ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. ఇంటర్వ్యూలు, ముఖ్యమైన మీటింగ్‌లు, కొత్త ప్రాజెక్టులలో మీ అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. గతంలో ఆగిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో భాగస్వామితో నమ్మకం, అవగాహన పెరుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

46
తుల రాశి
Image Credit : Pixabay

తుల రాశి

తుల రాశి వారికి ఈ యోగం వృత్తి పరమైన ఎదుగుదలకు బలాన్ని ఇస్తుంది. మీ కష్టాన్ని, ప్రతిభను పై అధికారులు గమనించి ప్రశంసించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలను తెచ్చిపెడతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నప్పటికీ, ఖర్చులు కూడా పెరగకుండా చూసుకోవాలి. కుటుంబ జీవితంలో భాగస్వామితో కలిసి భవిష్యత్తు కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటారు.

56
మకర రాశి
Image Credit : Pixabay

మకర రాశి

మకర రాశి వారికి ఈ యోగం చాలా కాలంగా ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఉద్యోగాలలో మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన, కఠోర శ్రమ పై అధికారుల నమ్మకాన్ని పెంచుతుంది. దీనివల్ల కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. వ్యాపారులు పెద్ద ఒప్పందాలు లేదా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలోని పెద్దల సలహాలు కీలక సమయంలో ఉపయోగపడతాయి.

66
కుంభ రాశి
Image Credit : Pixabay

కుంభ రాశి

కుంభ రాశివారికి ఈ నవపంచమ దృష్టి యోగం కెరీర్‌లో కొత్త గుర్తింపును తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా క్రియేటివిటీ, కళలు, డిజిటల్ సంబంధిత రంగాల్లో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. ఆఫీసులో కీలకమైన బాధ్యతలు దక్కుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అనుకోని ఆర్థిక లాభాలు అందే సూచనలు ఉన్నాయి. ప్రేమ, కుటుంబ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సేవ, ఇతరులకు సహాయం చేయడం వంటి పనులలో పాల్గొనడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం ఏ రాశివారికి లాభం, ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు!
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Related Stories
Recommended image1
Love Marriage: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటే ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!
Recommended image2
Interesting Facts: వారం రోజులు కరెంట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved