Saturn Transit: 27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి శని.. ఈ రాశులకు అపారమైన ధనప్రాప్తి
Saturn Transit: కర్మ ఫల ప్రదాత, న్యాయాధిపతి అయిన శని గ్రహం జనవరి 20వ తేదీన నక్షత్రాన్ని మార్చుకొని ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టింది. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలు అందనున్నాయి.

Saturn Transit
శని దేవుడు సుమారు 27 ఏళ్ల తర్వాత తన సొంత నక్షత్రమైన ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించింది. శని తన సొంత నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభం కలుగుతుంది. కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కూడా పెరుగుతుంది. రాజయోగం కూడా పడుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
వృషభ రాశి...
శని నక్షత్ర మార్పు.. వృషభ రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా కలిసొచ్చే సమయం అని చెప్పొచ్చు. ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. పెండింగ్ లో ఉన్న బకాయిలు తీరతాయి. కెరీర్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కలిసొస్తాయి.సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
మిథున రాశి...
శని నక్షత్ర మార్పు మిథున రాశివారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తిపరంగా వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పనితీరుకు పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. విదేశీ సంబంధాల ద్వారా లభాలు పొందుతారు.
మకర రాశి..
మకర రాశివారికి శని తృతీయ స్థానంలో సంచరించడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. మీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. కోర్టు కేసులు లేదా వివాదాల్లో మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. భూమి లేదా ఆస్తికి సంబంధిత వ్యవహారాల్లో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది.
తుల రాశి..
తుల రాశి వారికి శని యోగకారుకుడు కావడం వల్ల ఈ నక్షత్ర మార్పు వీరికి రక్షణ కవచంలా పని చేస్తుంది. అందుకే, ఈ సమయం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ సమయంలో ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.
ఉత్తరాభాద్రపద నక్షత్రంలో శని ప్రత్యేకత:
ఉత్తరాభాద్రపద నక్షత్రానికి అధిపతి శని దేవుడే. తన సొంత నక్షత్రంలో శని సంచరించినప్పుడు ఆయన మరింత శక్తివంతంగా మారుతాడు. ఈ సమయంలో క్రమశిక్షణ, నిజాయితీ , కష్టపడే తత్వం ఉన్నవారికి శని దేవుడు అడగకముందే వరాలను ప్రసాదిస్తాడు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
శని ప్రభావం సానుకూలంగా ఉన్నప్పటికీ, అందరూ ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం మంచిది:
శనివారం రోజు శని చాలీసా పఠించడం,పేదలకు లేదా వికలాంగులకు అన్నదానం చేయడం,నల్ల నువ్వులతో శని దేవునికి తైలాభిషేకం చేయడం లాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

