MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Shani Transit: శని మాయాజాలం... ఈ మూడు రాశుల లైఫ్ లో కష్టాలు మాయం, సంపాదన రెట్టింపు

Shani Transit: శని మాయాజాలం... ఈ మూడు రాశుల లైఫ్ లో కష్టాలు మాయం, సంపాదన రెట్టింపు

Shani Transit: జోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని కర్మ ఫలదాతగా పరిగణిస్తారు. మనం చేసిన కృషికి తగిన ఫలితాలను ఇవ్వడంలో శని  పాత్ర  కీలకం. కొన్నిసార్లు శని ప్రభావం  కఠినంగా అనిపించినా,  అనుగ్రహం కలిసి వస్తే జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి 

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 17 2025, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Saturn Transit
Image Credit : Asianet News

Saturn Transit

2026లో శని గ్రహం మాయాజాలం చేయనున్నాడు. ఈ మాయాజాలం కారణంగా మూడు రాశుల జీవితాల్లో కష్టాలన్నీ మాయం అయిపోతాయి. వచ్చే ఏడాది శని సుమారు ఆరు నెలల పాటు సరళ రేఖలో( డైరెక్ట్ మోషన్ ) సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో శని ప్రభావం కొన్ని రాశులకు అత్యంత అనుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ శని అనుగ్రహం కారణంగా మూడు రాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతమైన లాభాలు పొందనున్నారు. ఆ రాశులేంటో చూద్దాం....

24
కన్య రాశి....
Image Credit : Asianet News

కన్య రాశి....

2026లో శని గ్రహ ప్రభావంతో కన్య రాశివారి జీవితంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటి వరకు చేసిన కష్టం, ఓర్పు, పట్టుదలకి తగిన ఫలితాలు ఈ కాలంలో అందుతాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లేదా జీతం పెరగడం వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న కన్య రాశి వారికి కొత్త ప్రాజెక్టులు, కొత్త భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మొత్తంగా కన్య రాశివారికి 2026లో శని అనుగ్రహంతో ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

Related Articles

Related image1
Zodiac signs: ఈ రాశి అమ్మాయిలు ప్రేమించిన వారికి కోసం ప్రాణాలైనా ఇస్తారు..!
Related image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరి సపోర్ట్ లేకున్నా కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు
34
తుల రాశి...
Image Credit : Asianet News

తుల రాశి...

శని దేవుడి అనుగ్రహం 2026 లో తుల రాశి వారిపై కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నవారికి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు పెరిగినా, వాటిని సమర్థంగా నిర్వహించి మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థికంగా తుల రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. కొంత మందికి విదేశీ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

44
మకర రాశి....
Image Credit : Asianet News

మకర రాశి....

శని దేవుడికి అత్యంత ఇష్టమైన రాశి మకర రాశి. అందువల్ల, 2026లో శని ప్రభావం మకర రాశి వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. సుమారు 6 నెలల పాటు ఈ రాశివారికి అదృష్టం పట్టనుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో కీలకమైన ప్రాజెక్టులు చేపడతారు. వాటిలో కూడా విజయం సాధిస్తారు. శత్రువులపై కూడా విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు చాలా లాభదాయకంగా మారతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు తీసుకునే నిర్ణయాలన్నీ చాలా అనుకూలంగా మారతాయి.

ఫైనల్ గా....

మొత్తానికి, 2026లో శని గ్రహ సరళ సంచారం వల్ల కన్యా, తులా, మకర రాశుల వారికి ఉద్యోగ, ఆర్థిక, వ్యక్తిగత జీవితాల్లో శుభఫలితాలు దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి. శని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలంటే క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడి పని చేసే స్వభావాన్ని కొనసాగించడం ఎంతో అవసరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Lucky Zodiac Signs: ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి ఎదురులేదు.. రెట్టింపు ఆదాయం
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారికి మొద‌ట్లో క‌ష్టాలున్నా.. శ‌ని ద‌య‌తో జీవితం మారుతుంది
Recommended image3
Zodiac Signs: ఈ 7 రాశులవారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం పండగే.. ఎంత బాగా చూసుకుంటారో!
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశి అమ్మాయిలు ప్రేమించిన వారికి కోసం ప్రాణాలైనా ఇస్తారు..!
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరి సపోర్ట్ లేకున్నా కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved