- Home
- Astrology
- Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరి సపోర్ట్ లేకున్నా కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరి సపోర్ట్ లేకున్నా కెరీర్ లో మంచి స్థాయికి వెళతారు
Birth Stars: జీవితంలో ఎవరి సహాయం లేకుండా ఎదగాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు మాత్రం ఈ కోరికను నిజం చేసుకుంటారు. కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు

Birth Stars
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ లో ఎదుగుతున్న సమయంలో ఈ అవసరం మరింత ఎక్కువగా ఉండొచ్చు. కానీ, కొంతమంది అమ్మాయిలు మాత్రం తమ శ్రమ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతోనే కెరీర్ లో గొప్ప స్థాయికి చేరుకుంటారు. వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ఎవరి మీద ఆధారపడటానికి ఇష్టపడరు. తమ పని తామే చేసుకోవాలని అనుకుంటారు. ఎవరి సహాయం లేకుండానే... తమ కాళ్ల మీద తాము నిలపడాలి అనుకుంటారు. అదే చేస్తారు కూడా. పట్టుదలతో తమ కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మరి, ఆ నక్షత్రాలేంటో చూద్దామా....
రోహిణి నక్షత్రం....
రోహిణీ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు సహజంగా స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ అమ్మాయిలు జీవితంలో చాలా ఎక్కువగా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. జీవితంలో ఏం కావాలి అనే విషయంలో వీరికి క్లారిటీ ఉంటుంది. చిన్న చిన్న లక్ష్యాలతో మొదలుపెట్టి.. క్రమంగా విజయానికి చేరువ అవుతారు. వీరికి ఆర్థిక స్వతంత్రత చాలా ముఖ్యం. కెరీర్ లో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా తట్టుకొని నిలపడే శక్తి వీరికి ఉంటుంది. ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మయిలు ఫైనాన్స్, బిజినెస్, మేనేజ్మెంట్ రంగాల్లో గొప్పగా రాణించగలరు.
మాఘ నక్షత్రం....
మాఘ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిల్లో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగి ఉంటారు. జీవితంలో ఏం సాధించాలి అనే విషయంలో వీరికి చిన్నప్పటి నుంచే క్లారిటీ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వీరు ప్రవర్తిస్తారు. అధికార, పరిపాలన, రాజకీయ రంగాల్లో వీరు చాలా తొందరగా గుర్తింపు పొందుతారు.
స్వాతి నక్షత్రం...
స్వాతి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారు. వీరు స్వేచ్ఛను మాత్రమే ప్రేమిస్తారు. ఇతరుల ఆదేశాలను వీరు ఫాలో అవ్వాలని అనుకోరు. తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని, దానిలోనే నైపుణ్యం సాధిస్తారు. ఒంటరిగా పోరాడటానికి కూడా ఏ మాత్రం వెనకాడరు. వీరు స్టార్టప్, ఫ్రీలాన్సింగ్, క్రియేటివ్ కెరీర్ ఎంచుకుంటే మంచి విజయం సాధిస్తారు.
మూలా నక్షత్రం...
మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు కూడా జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ బలంగా ఎదుగుతారు. వీరు భయాన్ని కూడా తమకు బలంగా మార్చుకుంటారు. కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు. ఒక్కసారి లక్ష్యం ఏర్పరుచుకుంటే.. దానిని సాధించడానికి ఎంత దూరమైనా వెళతారు.
శ్రవణ నక్షత్రం...
శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలకు నేర్చుకునే తపన చాలా ఎక్కువ. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో వీరు చాలా దిట్ట. తమ ప్రతిభను మాటలతో, జ్ఞానంతో నిరూపిస్తారు. జీవితంలో ఎవరిపై ఆధారపడకుండా తమ తెలివితేటలతోనే ఎదుగుతారు. మీడియా, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, కౌన్సెలింగ్ వంటి రంగాలు ఎంచుకుంటే ఉన్నత స్థాయికి వెళతారు.

