MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Rashmika Vijay Wedding: రష్మిక- విజయ్ పెళ్లి ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఇదే

Rashmika Vijay Wedding: రష్మిక- విజయ్ పెళ్లి ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఇదే

Rashmika Vijay Wedding: టాలీవుడ్ మోస్ట్ రూమర్డ్ కపుల్ విజయ్- రష్మిక పెళ్లి గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి.తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. మరి, వారి పెళ్లి తేదీకి చాలా ప్రత్యేకత ఉందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 18 2026, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Rashmika Vijay Devarakonda
Image Credit : stockPhoto

Rashmika Vijay Devarakonda

టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల అంటే ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరగనుంది. ఈ మేరకు వెడ్డింగ్ కార్డ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఫిబ్రవరి 26వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత, ముహూర్త విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విజయ్- రష్మిక పుట్టిన తేదీ..
Image Credit : Asianet News

విజయ్- రష్మిక పుట్టిన తేదీ..

1.విజయ్ దేవరకొండ మే9వ తేదీన జన్మించారు. 9వ సంఖ్యకు కుజుడు అధిపతి. ఈ సంఖ్య ధైర్యానికీ, పట్టుదలకు సంకేతం.

2.రష్మిక ఏప్రిల్ 5వ తేదీన జన్మించారు. 5వ సంఖ్యకు బుధుడు అధిపతి. ఇది తెలివితేటలకు, కమ్యూనికేషన్, ఆకర్షణకు సంకేతం.

న్యూమరాలజీ ప్రకారం.. 9, 5 తేదీల కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరు వేగానికి ( విజయ్) సంకేతమైతే, మరొకరు చాకచక్యానికి( రష్మిక) నిదర్శనం. అందుకే వీరు ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ ఫర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారని నిపుణులు చెబుతున్నారు.

33
పెళ్లి ముహూర్తం ప్రత్యేకత...
Image Credit : X

పెళ్లి ముహూర్తం ప్రత్యేకత...

ఫిబ్రవరి 26, 2026 ( గురువారం) జోతిష్య రీత్యా వివాహాలకు అత్యంత అనుకూలమైన రోజులలో ఒకటిగా పరిగణిస్తారు.

ఆరోజు తిథి.. శుక్ల పక్ష దశమి. ఇది శుభకార్యాలకు, ముఖ్యంగా వివాహాలు చాలా మంచి తిథి.

నక్షత్రం.. మృగశిర( మధ్యాహ్నం 12:11 వరకు), ఆ తర్వాత ఆర్ద్ర నక్షత్రం ప్రవేశిస్తుంది. మృగశిర నక్షత్రం వివాహాలకు చాలా ప్రశస్తమైనది.

వారం : గురువారం( బృహస్పతి వారం). గురువు వివాహానికి కారకుడు. కాబట్టి ఈ వారం పెళ్లి చేసుకోవడం వల్ల దంపతుల మధ్య మంచి అవగాహన, గౌరవం పెరుగుతాయి.

ఫిబ్రవరి 26న స్పెషాలిటీ...

రవి యోగం: ఈ రోజంతా 'రవి యోగం' ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రవి యోగంలో చేసే పనులు విజయవంతమవుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.

శుభ గ్రహాల స్థితి: ఈ సమయంలో శుక్రుడు, గురువు బలమైన స్థితిలో ఉండటం వల్ల వివాహ బంధం కలకాలం నిలుస్తుందని నమ్ముతారు.

3. ఆ రోజు పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది?

సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య అంచనాల ప్రకారం:

స్థిరత్వం: ఫిబ్రవరి 26 (2+6=8) శని ప్రభావం ఉన్నప్పటికీ, అది గురువారం, మృగశిర నక్షత్రంతో కలవడం వల్ల జీవితంలో స్థిరత్వం, ఆర్థిక ఎదుగుదల బాగుంటుంది.

ప్రేమ , గౌరవం: వీరిద్దరి రాశులు (వృషభం , కన్య) భూ తత్వ రాశులు కావడం వల్ల వీరు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ, సమాజంలో ఒక 'పవర్ కపుల్'గా గుర్తింపు పొందుతారు.

వృత్తిపరమైన ఎదుగుదల: పెళ్లి తర్వాత వీరిద్దరి కెరీర్ గ్రాఫ్ మరింత పైకి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా రష్మికకు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

ఒక చిన్న గమనిక:

అయితే, ఫిబ్రవరి 26న బుధుడు వక్ర గతిలో (Mercury Retrograde) ప్రవేశిస్తాడు. దీనివల్ల కమ్యూనికేషన్ విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా, వీరిద్దరి జాతకాలు , ఆ రోజు ఉన్న శుభ ముహూర్తం బట్టి చూస్తే, వీరి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Mega Twins: రామ్ చరణ్ కవల పిల్లల జాతకం ఎలా ఉండనుంది? పండితులు ఏం చెబుతున్నారు
Recommended image2
Rashmika Mandanna: రష్మిక ఎప్పుడూ నవ్వుతూనే ఎందుకు ఉంటుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved