Guru Shukra Gochar: 12 నెలల తర్వాత ఈ మూడు రాశులకు రాజయోగం, కష్టాలన్నీ తీరినట్లే..!
Guru Shukra Gochar: గురు, శుక్ర గ్రహాల కలయికతో షడష్టక యోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం మూడు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలిగించనుంది. అదృష్టం రెట్టింపు అవుతుంది.

Zodiac signs
వేద జోతిష్య శాస్త్రం ప్రకారం, దేవతల గురువు అయిన బృహస్పతి ఒక నిరిష్ట కాలం తర్వాత తనన రాశిని మారుస్తాడు. దీని ప్రభావం 12 రాశులపై చాలా ఎక్కువగా పడుతుంది. అదృష్ట గ్రహమైన బృహస్పతి ప్రస్తుతం మిథున రాశిలో వక్రగమనంలో ఉంది. జూన్ 2026 వరకు అక్కడే ఉంటుంది. శుక్రుడు ప్రస్తుతం వృక్ష రాశిలో ఉన్నాడు. గురు, శుక్ర గ్రహాలు 150 డిగ్రీల కోణంలో ఉండి, షడష్టక దృష్టి యోగాన్ని సృష్టిస్తారు. ఈ యోగం మూడు రాశులకు ఊహించని ప్రయోజనాలు కలిగించనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం....
కర్కాటక రాశి...
కర్కాటక రాశివారికి గురు-శుక్రుల కలయిక అనే విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈ రాశివారికి గురు గ్రహం రెండో ఇంట్లో, శుక్రుడు ఐదో ఇంట్లో ఉన్నారు. దీని ఫలితంగా ఈ రాశిలో జన్మించిన వారు అనేక రంగాలలో గణనీయమైన లాభాలు పొందుతారు. జీవితంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమౌతాయి. మీ జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఆదాయం కూడా చాలా వేగంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతారు.
మేష రాశి....
మేష రాశిలో శుక్రుడు జాతకంలో ఎనిమిదో ఇంట్లో, గురు గ్రహం రెండో ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని ఫలితంగా, ఈ రాశిలో జన్మించిన వారికి షడష్టక యోగం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెంచుకోవడానికి అనేక కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కెరీర్ లో కూడా మంచి లాభాలు పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా మారుతుంది.
ధనుస్సు రాశి...
గురు-శుక్ర సంచారం ధనుస్సు రాశివారికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలిగించనుంది. శుక్రుడు పన్నెండో ఇంట్లో, గురు ఏడో ఇంట్లో ఉన్నారు. దీని ఫలితంగా, ఈ రాశివారు అనేక రంగాలలో ప్రయోజనం పొందవచ్చు. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. కెరీర్ పరంగా, మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిబద్ధతతో ఏ పని చేసినా మీరు మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

