Birth Month: ఈ 5 నెలల్లో పుట్టిన వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు..!
Birth Month: జీవితంలో డబ్బులు ఎక్కువగా సంపాదించాలని, ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దాని కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే, కొన్ని నెలల్లో పుట్టిన వారికి ఈ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నెలలు ఏంటో చూద్దాం...

జనవరి....
జనవరి నెలలో పుట్టిన వారికి క్రమశిక్షణ చాలా ఎక్కువ. కష్టపడి పనిచేసే స్వభావం వీరిది. వీరు ఒకేసారి కోటీశ్వరులు అయిపోరు. కానీ, చాలా స్థిరంగా, నెమ్మదిగా కోరుకున్న స్థాయికి ఎదుగుతారు. ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళతారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద సంస్థలో ఉన్నత స్థానాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
మార్చి...
మార్చిలో పుట్టిన వారికి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిలో ఊహా శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో జన్మించిన వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు. వీరు వ్యాపారం, కళలు, మీడియా, టెక్నాలజీ రంగాల్లో ధనం ఎక్కువగా సంపాదించే అవకాశం ఉంది. సరైన దిశలో ప్రయత్నిస్తే... వీరి సంపద చాలా తొందరగా పెరుగుతుంది.
3.మే...
మే నెలలో జన్మించిన వారు కూడా ధనవంతులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నెలలో పుట్టిన వారికి బలమైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువ అని చెప్పొచ్చు. వ్యాపారం, రియల్ ఎస్టేట్, మేనేజ్మెంట్ రంగాలు ఎంచుకుంటే.. వీరికి మంచి లాభాలు వస్తాయి. చాలా తక్కువ సమయంలోనే వీరు ఆర్థికంగా మంచి స్థాయికి ఎదుగుతారు.
4.ఆగస్టు...
ఆగస్టులో పుట్టిన వారికి సహజంగా అధికారం, ఆత్మ విశ్వాసం ఉంటుంది. వీరు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని, వాటిని సాధించే తత్వం కలిగి ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు రాజకీయాలు, వ్యాపారం, కార్పొరేట వంటి రంగాలు ఎంచుకుంటే మంచి సంపాదన పొందుతారు.
5.నవంబర్....
నవంబర్ నెలలో పుట్టిన వారు కూడా కష్టపడి ధన సంపాదన పెంచుకుంటారు. వీరు చాలా వ్యూహాత్మక ఆలోచనలు చేస్తారు. ఎలాంటి కష్టమైన వాటినైనా అర్థం చేసుకోగల సత్తా వీరిలో ఉందని చెప్పొచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్, రీసెర్చ్, పెట్టుబడుల ద్వారా ధనం సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
గమనిక: జన్మ నెల మాత్రమే కాదు, కృషి, నిర్ణయాలు, అవకాశాల వినియోగమే నిజమైన సంపదకు కారణం. అయినా జ్యోతిష్యపరంగా ఈ నెలల్లో పుట్టినవారికి ధనయోగం బలంగా ఉంటుందని చెబుతారు.

