Rahu Transit: 2026 లో రాహువు సంచారం... ఈ నాలుగు రాశులు జాగ్రత్తగా ఉండాల్సిందే
Rahu Transit: 2026లో రాహువు రెండుసార్లు కీలక మార్పులు చేసుకోనుంది. ఈ మార్పులు నాలుగు రాశుల వారిని చిక్కుళ్లో పడే అవకాశం ఉంది. ఊహించని వైపు నుంచి సమస్యలను తెచ్చి పెడుతుంది.

Rahu Transit
2026 సంవత్సరం దగ్గరపడుతోంది. మరి కొద్దిరోజుల్లో మనమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ న్యూ ఇయర్ లో జోతిష్యం పరంగా అనేక గ్రహాలలో మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా రాహు ఈ ఏడాదిలో రెండుసార్లు కీలక మార్పులు చేయనున్నాడు. ఆగస్టు2న రాహు కుంభ రాశిలో ఉండి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 5న కుంభ రాశిని వదిలి, మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు రాశులపై శని ప్రభావం ఉండటం వల్ల.. రాహు సంచారం మరింత కీలకంగా మారనుంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం....
1.వృశ్చిక రాశి...
2026లో రాహు ప్రభావం వృశ్చిక రాశిక వారికి అనేక సవాళ్లను తెస్తుంది. రాహు సంచారం కారణంగా ఈ రాశివారికి కుటుంబ సభ్యులు, బంధువులతో అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా అత్తమామలతో ఆర్థిక వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లోనూ లాభాలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. మానసిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ఏ పనిలోనూ ఎలాంటి హడావిడి లేకుండా... జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మరింత అవసరం.
2.కన్య రాశి...
రాహు సంచారం కన్య రాశివారికి కూడా చాలా సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. పైగా ఆదాయం తగ్గిపోయి... ఖర్చులు బాగా పెరిగిపోతాయి. వ్యాపారంలోనూ ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. చేసిన అప్పులు తీర్చడం చాలా కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు మరిన్ని ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది.
3.సింహ రాశి...
సింహ రాశివారు 2026లో రాహు ప్రభావంతో చాలా సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. ఉద్యోగంలో, కెరీర్ లో అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లోనూ అనుకోని నష్టాలు రావచ్చు. మధ్యలోనే ఆగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. పెట్టుబడులు, లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే మీరే నష్టపోతారు. అందుకే ఈ రాశివారు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు.
4.వృషభ రాశి....
2026లో వృషభ రాశివారు రాహు ప్రభావం వల్ల మానసిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అవరోధాలు, పనుల్లో మందగమనం ఉండొచ్చు. ఆదాయం తగ్గి ఆందోళన పెరుగుతుంది. ఆకస్మిక ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే, ఈ రాశివారు ఈ ఏడాది మొత్తం జాగ్రత్తగా, అప్రమత్తంగా, ప్రశాంతతగా ఉండటం అవసరం.

