Name Astrology: ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు!
మన పేరు.. వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. కొన్ని అక్షరాలతో పేరు మొదలైన అబ్బాయిలు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు.

Name Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన స్పందన, శక్తి ఉంటాయి. మన పేరు మొదలయ్యే అక్షరం మన వ్యక్తిత్వం, ఆలోచనలు, గమ్యం, అదృష్టంపై కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా “అ” (A) అక్షరం. “అ” అక్షరం అగ్ని తత్త్వాన్ని, కొత్త ప్రారంభాలను, నాయకత్వ లక్షణాలను సూచిస్తుంది. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు చిన్న వయసులోనే శక్తిమంతంగా ఎదుగుతారు.
మేషరాశితో బలమైన సంబంధం
“అ” అక్షరం మేష రాశితో బలమైన సంబంధం కలిగి ఉంటుంది. మేషం అగ్ని తత్త్వ రాశి కావడం వల్ల ధైర్యం, నిర్ణయశక్తి, త్వరితగతినా ముందుకు వెళ్లే స్వభావం.. “అ” అక్షరంతో పేర్లు కలిగిన వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు “అ” అక్షరంతో పేరున్న అబ్బాయిలపై కుజ గ్రహ ఆధిపత్యం ఉంటుంది. కుజుడు శక్తి, పోరాటం, నాయకత్వం, స్పూర్తి, వేగవంతమైన పురోగతికి సూచిక. ఈ కారణంగా అన్నింట్లో ముందుండాలనే తపన వీరిలో సహజంగానే ఉంటుంది.
విజయ రహస్యం
“అ” అక్షరంతో పేరున్న అబ్బాయిలలో ఆర్థిక విజయం కోసం అవసరమైన ప్రధాన లక్షణాలు సహజసిద్ధంగా ఉంటాయి. వీరికి చిన్న వయసులోనే పెద్ద అవకాశాలు రావడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం, అన్నింట్లో ముందడుగు వేయడం వల్ల వీరు త్వరగా విజయం సాధించగలుగుతారు.
నాయకత్వ లక్షణాలు
“అ” అక్షరంతో పేరున్న అబ్బాయిలు బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు ప్రదర్శిస్తారు. స్కూల్, కాలేజీ, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్కడున్నా వీరే ముందుండడానికి ట్రై చేస్తారు. తోటివారు, స్నేహితులు కూడా వీరిని లీడర్‌గా అంగీకరిస్తారు. ఈ లక్షణం వల్ల చిన్న వయసులోనే వీరు వ్యాపారం మొదలుపెట్టడం, లేదా ఉద్యోగంలో వేగంగా ఎదగడం సాధ్యమవుతుంది.
సూర్యుడి ప్రభావం
సూర్యుడి ప్రభావం కూడా “అ” అక్షరంతో పేరున్న వారిపై బలంగా ఉంటుంది. సూర్యుడు అధికారం, కీర్తి, సంపద, ప్రతిష్ఠలకు సూచిక. ఈ గ్రహం బలంగా అనుగ్రహిస్తే వ్యక్తి చిన్న వయసులోనే ఇతరుల కంటే వేగంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది.
నమ్మకం ఎక్కువ
“అ” అక్షరంతో పేరున్న అబ్బాయిలలో స్వతంత్రంగా ఉండాలనే తపన ఎక్కువ. ఎవరి మీద ఆధారపడకుండా, తమ శక్తితో తాము ఎదగాలి అనుకుంటారు. ఇదే వీరిని కోటీశ్వరులయ్యే దిశగా నడిపిస్తుంది. పెట్టుబడులు, వ్యాపారం, ఉద్యోగం.. ఏ రంగంలో ఉన్నా సరే, వీరు వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలపై పూర్తి నమ్మకం కలిగి ఉంటారు.

