Gemini Horoscope 2026: మిథున రాశివారి కెరీర్ లో ఊహించని మార్పులు, 2026 ఎలా ఉండనుంది?
Gemini Horoscope 2026: కొత్త సంవత్సరంలో మిథున రాశివారి ఆర్థిక, వృత్తి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, విదేశీ ప్రయాణ అవకాశం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం...

Gemini Horoscope 2026
2026 సంవత్సరం సమీపిస్తోంది. ఈ కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని, కొత్త ఇల్లు, వాహనం, నగలు లేదా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయాలని కోరుకుంటారు. ఇది చాలా సహజం. అయితే, ఇది సాధ్యం కావాలంటే గ్రహస్థితి అనుకూలంగా ఉండాలి. డబ్బు సరైన సమయానికి చేతికి రావాలి. ఈ నేపథ్యంలో 2026లో మిథున రాశి వారి కెరీర్, ఆర్థిక స్థితి ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
సంవత్సర ప్రారంభం( జనవరి- మార్చి) లో...
2026 సంవత్సరం మొదటి మూడు నెలలు మిథున రాశివారికి అత్యంత శుభప్రదంగా ఉంటాయి. బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటంతో కొత్త కెరీర్ అవకాశాలు వస్తాయి. పేరు, ప్రతిష్ఠ పెరుగుతాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి ఆ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే సరైన సమయం. ఉద్యోగం చేసే వారికి జీతం పెరగడం, పదోన్నతి వంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే... ఈ ఏడాది అనుకూలంగానే ఉంటుంది.
సంవత్సరం మధ్యలో ( ఏప్రిల్ - సెప్టెంబర్)
జూన్ 2026 తర్వాత బృహస్పతి రెండో ఇల్లు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మిథున రాశివారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. వారసత్వంగా వచ్చే సంపద కూడా పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు మళ్లీ మీ చేతికి అందే అవకాశం ఉంది. బంగారం, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులకు ఇది శుభ సమయం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.
అయితే శని సంవత్సరాంతం వరకు పదవ ఇంట్లో ఉంటుంది. కాబట్టి కష్టపడినప్పుడు మాత్రమే దీర్ఘకాల ఫలితాలు వస్తాయి. రాహువు విదేశీ ప్రయాణం, ఉన్నత విద్యకు అవకాశాలను తెస్తే, కేతువు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అందువల్ల మధ్యకాలంలో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.
సంవత్సరం చివరల్లో ( అక్టోబర్- డిసెంబర్)
31 అక్టోబర్ 2026 తర్వాత బృహస్పతి మూడో ఇంటికి మారతాడు. ఈ సమయంలో ఆర్థికంగా ఎక్కువగా లాభాలు పొందుతారు. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, ఆన్ లైన్ వ్యాపారం, కంటెంట్ రైటింగ్ కి చెందిన వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఈ రంగాల్లో ఉన్నవారు మంచి ఆర్థిక వృద్ధిని పొందుతారు. విదేశీ పెట్టుబడులు కూడా లాభప్రదం అవుతాయి. అయితే, పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

