Rahu Transit: 18 ఏళ్ల తర్వాత బుధ, రాహు కలయిక.. ఈ మూడు రాశలు దరిద్రం దూరమైనట్లే..!
Rahu Transit: జోతిష్య శాస్త్రం ప్రకారం 18 సంవత్సరాల తర్వాత బుధ, రాహువుల అరుదైన కలయిక జరగనుంది. ఇది మూడు రాశుల జీవితాల్లోకి మంచి రోజులు తీసుకువస్తోంది. ఈ రాశులవారు కెరీర్, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.

Rahu Transit
జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి.ఒక్కోసారి ఇతర గ్రహాలతో సంయోగాన్ని కూడా ఏర్పరుస్తాయి. దీని ప్రభావం మానవ జీవితంపై పడుతుంది.ఫిబ్రవరిలో బుధ, రాహువుల సంయోగం జరగబోతోంది. ఈ కలయిక 18 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో జరగబోతోంది. ఫలితంగా కొన్ని రాశులకు అదృష్టం పెరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...
మిథున రాశి...
బుధ, రాహు గ్రహాల కలయిక మిథున రాశి వారికి ఊహించని ప్రయోజనాలు, లాభాలు తీసుకురాగలదు. ఈ కలయిక ఈ రాశి వారి తొమ్మిదో ఇంట్లో ఏర్పడుతుంది. అందువల్ల.. ఈ సమయం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం రావచ్చు. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఏ పని చేసినా విజయం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కుంభ రాశి..
బుధ, రాహు కలయిక కుంభ రాశి వారికి కూడా సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ కలయిక మీ జాతకంలో లగ్న స్థానంలో ఏర్పడుతుంది. ఇది ఆ సమయంలో మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ పనిలో మంచి ప్రమోషన్ పొందుతారు.ఈ సమయంలో మీ ఆదాయం కూడా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. భవిష్యత్ అద్భుతంగా మారుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం అద్భుతంగా మారుతుంది.
మేష రాశి...
రాహు, బుధ కలయిక మేష రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం పొందుతారు. ఈ కలయిక మేష రాశివారి 11వ ఇంట్లో ఏర్పడుతుంది. అందువల్ల, ఈ సమయంలో మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారి ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ల నుండి కూడా ప్రయోజనాలు పొందుతారు.

