- Home
- Astrology
- Rahu Gochar: మహాశక్తిగా మారనున్న రాహువు, ఫిబ్రవరిలో ఈ 3 రాశుల వారి జీవితాల్లో భారీ మార్పు
Rahu Gochar: మహాశక్తిగా మారనున్న రాహువు, ఫిబ్రవరిలో ఈ 3 రాశుల వారి జీవితాల్లో భారీ మార్పు
Rahu Gochar: జ్యోతిషశాస్త్రంలో రాహువును దుష్టగ్రహంగా, ఛాయా గ్రహంగా, భ్రమల గ్రహంగా పిలుస్తారు. కానీ కొన్నిసార్లు రాహువు వల్ల కెరీర్, సంబంధాలు, జీవితం అద్భుతంగా సాగుతుంది. ఫిబ్రవరిలో రాహువు వల్ల కొన్ని రాశుల వారి జీవితమే మారిపోతుంది.

ఫిబ్రవరిలో రాహుసంచారం
జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు చెడు మాత్రమే చేయడు, కొన్నిసార్లు అద్భుతమైన యోగాలు ఏర్పరచి ఎన్నో రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా రాహువు అటువంటి శక్తివంతమైన గ్రహంగా మారబోతున్నాడు. కుంభరాశిలో ఉన్న రాహువుతో పాటు బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు ఒకేసారి శని రాశిలోకి ప్రవేశిస్తారు. నాలుగు గ్రహాలతో కలిసిన ఈ రాహువు అరుదైన కలయిక వల్ల బలమైన ప్రభావావాన్ని చూపిస్తాడు. ముఖ్యంగా మూడు రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.
మేష రాశి
మేష రాశి వారికి పనిచేసే చోట ఆకస్మిక మార్పులు కలుగుతాయి. ఉద్యోగ స్వభావం లేదా వారి బాధ్యతలు మారే అవకాశం ఉంది. వీరికి షేర్ మార్కెట్లో ఆకస్మిక లాభాలు పొందే ఛాన్స్ ఉంది. లేదా ప్రమాదకర పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ప్రేమ సంబంధాల్లో కొత్త మలుపులు జరుగుతాయి. అయితే ఈ రాశివారి మరింత స్వేచ్ఛగా మాట్లాడటం వల్ల బంధం మరింత బలపడుతుంది. కాకపోతే వీరికి శారీరక అలసట, మానసిక చికాకు వంటివి అధికంగా కలుగుతాయి. ఈ రాశి వారికి తమ సొంత నియమాలతో జీవించాలనే కోరిక అధికంగా ఉంటుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి రాహువు వల్ల ఎంతో మంచి జరగబోతోంది. ఫిబ్రవరిలో వీరి కెరీర్‌లో కొత్త అవకాశాల కోసం కొత్త తలుపులు తెరుచుకుంటాయి. కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు ఈ రాశి వారికి వేరే స్థాయికి తీసుకెళ్తాయి. అయితే ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సి రావడం వల్ల గందరగోళం ఏర్పడవచ్చు. మాటలు కఠినంగా కాకుండా ప్రేమగా మాట్లాడితే బంధం మధురంగా ఉంటుంది. అయితే నాడీ వ్యవస్థ, నిద్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. పాత ఆలోచనలను వదిలి కొత్త జీవితాన్ని ఆస్వాదించండి. ఆ ధైర్యం కూడా మీకు వస్తుంది.
తులా రాశి
తులా రాశి వారిపై రాహువు వల్ల వరాల వర్షం కురుస్తుంది. అయితే పని ఒత్తిడి పెరిగినా, మంచి పురోగతితో ఫలితాలు కనిపిస్తాయి. పనిచేసే చోట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఇక బంధాలు విడిపోయే దిశగా సాగుతాయి. హార్మోన్ల వల్ల మానసిక ఒత్తిడి పెరగొచ్చు. ఇతరుల కన్నా మీ సంతోషం, మీ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం.

