Personality Traits: పొట్టిగా ఉండే అమ్మాయిల్లో ఉండే స్పెషల్ లక్షణాలు ఇవే..!
ఈ అమ్మాయిలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని త్వరగా అర్థం చేసుకుంటారు. ఏ సమస్య వచ్చినా భయపడరు. చాకచక్యంగా ఆలోచించి తమకు ఎదురైన సమస్యను చాలా సులభంగా పరిష్కరించగలరు.

వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..
ఒక్కో వ్యక్తి శరీర నిర్మాణం ఒక్కోలా ఉంటుంది. ఒకరి శరీర నిర్మాణం మరొకరు కంటే భిన్నంగా ఉంటుంది. కొత్త మంది తక్కువ ఎత్తుతో ఉంటారు.. మరి కొందరు చాలా పొడుగ్గా ఉంటారు. కొందరు సాధారణ ఎత్తు కలిగి ఉంటారు. ఈ ఎత్తు, ఆకృతి వంటి అంశాలు జన్యుశాస్త్రం పై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, జోతిష్యశాస్త్రం, సాముద్రిక శాస్త్రం ప్రకారం, మన శరీర లక్షణాలు మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావాన్ని, మన భవిష్యత్తును పాక్షికంగా ప్రతిబింబిస్తాయని తెబుతారు. ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అని జోతిష్య శాస్త్రం చెబుతుంది. మరి, వారిలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటో తెలుసుకుందామా...
1.తెలివితేటలు...
పొట్టివారు గట్టివారు అనే సామేత వినే ఉంటారు. ఇది ఈ ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే.. ఈ అమ్మాయిలకు తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి అని జోతిష్యశాస్త్రం చెబుతోంది. వారు చురుకైన ఆలోచనా శక్తితో ఉంటారు. ఏ విషయం అయినా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తారు. ఈ అమ్మాయిలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని త్వరగా అర్థం చేసుకుంటారు. ఏ సమస్య వచ్చినా భయపడరు. చాకచక్యంగా ఆలోచించి తమకు ఎదురైన సమస్యను చాలా సులభంగా పరిష్కరించగలరు. చదువులోనూ, వృత్తిలోనూ ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. వీరు ఎక్కడ ఉన్నా, తమ తెలివితేటలతో తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు.
2.తమపై తమకు ఉన్న నమ్మకం...
ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలకు తమ పై తమకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. తాము ఏ పని అయినా చేయగలం అని, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలపడగలమనే నమ్మకం ఉంటుంది. వారు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం శక్తితో ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతారు. కష్టపడటానికి వెనుకాడరు. వారి దృఢ సంకల్పం వల్లే వారు అనేక రంగాల్లో గొప్ప విజయాలు సాధించగలుగుతారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు.
3.సంబంధాలలో ప్రాముఖ్యత..
జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తారు.కుటుంబ విలువలను గౌరవించే మనస్తత్వం కలిగి ఉంటారు. వారు సంబంధాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. పుట్టింట్లో తల్లిదండ్రులపై ఎంత ప్రేమ అయితే చూపిస్తారో.. పెళ్లి తర్వాత అత్తారింట్లో బంధాలకు కూడా అంతే విలువ ఇస్తారు. తమ సొంత తల్లిదండ్రుల్లా భావించి ప్రేమను పంచుతారు. కుటుంబ జీవితం, స్నేహితుల మధ్య సంబంధాలు చాలా ముఖ్యం అని వీరు భావిస్తారు.
4.వినయపూర్వకమైన ప్రవర్తన..
సాముద్రిక శాస్త్రం, జోతిష్య శాస్త్రం ప్రకారం ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలు చాలా వినయపూర్వకంగా ఉంటారు. వీరికి కొంచెం కూడా అహంకారం ఉండదు. అందరితోనూ చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. వీలైనంత వరకు చాలా శాంతంగా ఉంటారు. వారు ఇతరుల మనోభావాలను గౌరవిస్తారు. మాటలతో కానీ, తమ ప్రవర్తనతో కానీ ఎవరినీ బాధించకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. అందుకే వారు సమాజంలో అందరి ఆదరణ పొందుతారు.
5.ఆధ్యాత్మిక, మతపరమైన నమ్మకాలు..
ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలు ఆధ్యాత్మికంగా, మతపరమైన జీవనశైలిని ఫాలో అవుతారు. ఎక్కువ పూజలు చేయడానికి ఇష్టపడతారు. జపాలు చేయడం, ఉపవాసాలు చేయడం నిత్య కర్మలను నిబద్ధతతో పాటించడం మంచిదని నమ్ముతారు. ఇది వారి అంతర్గత శాంతికి, ఆత్మాభివృద్ధికి తోడ్పడుతుంది. అలాంటి జీవన విధానం వారిని నైతికంగా, ఆత్మవిశ్వాసంతో నడిపిస్తుంది.
6.భర్తకు అదృష్టాన్ని మోసుకొస్తారు...
జోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం, కాస్త ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు పెళ్లి తర్వాత తమ అత్తవారింటికి శుభాలను మోసుకొస్తారు. ముఖ్యంగా తమ భర్త జీవితాన్ని అదృష్టాన్ని తీసుకువస్తారు. వీరు అడుగుపెట్టిన ఇంట్లో శాంతి, ఆనందం, సంపదలను ఆహ్వానిస్తారు. భర్త వృత్తిపరమైన అభివృద్ధికి, కుటుంబ సమతుల్యతకు మద్దతుగా నిలుస్తారు. వారు ఉన్న ఇల్లు నిత్యం సంపద, ఆనందంతో సౌభాగ్యవంతంగా మారుతుంది.
7.శాస్త్రీయ ఆధారాలు లేవు, నమ్మకాలు మాత్రమే...
ఈ వివరాలన్నీ జ్యోతిషశాస్త్రం , సముద్రిక శాస్త్రం వంటి సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా మాత్రమే చెప్పారు. ఇవి శాస్త్రీయంగా నిరూపించినవి అయితే కాదు. వ్యక్తిత్వాన్ని, లక్షణాలను నిర్ణయించేది పూర్తిగా మన సంకల్పశక్తి, ఆలోచనా విధానం, పెరిగిన పరిసరాలు , మన ప్రవర్తనే మాత్రమే అని గుర్తించాలి.
ఫైనల్ గా..
ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలావరకు తెలివైనవారు, వినయశీలులు, కుటుంబానికీ సంబంధాలకూ ప్రాధాన్యతనిచ్చే వారు. వారు స్వీయ శక్తిపై నమ్మకంతో జీవించే వారు. ఆధ్యాత్మికత, నైతికత, వ్యవస్థగా జీవించాలనే తపన ఉన్న వారు. ఒక్కొక్కరు ఒక్కోలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కానీ జ్యోతిషశాస్త్రం వంటి విశ్వాసాల ప్రకారం కొన్ని లక్షణాలు పునరావృతమవుతూ ఉంటాయి. మీరు ఈ లక్షణాలలో ఏవైనా మీలో కనుగొంటే, వాటిని మెరుగుపరచండి. మంచి ప్రవర్తన, శ్రమ, ఆధ్యాత్మిక అభిరుచి వంటి విలువలు జీవితం మొత్తాన్ని మెరుగుపరుస్తాయి. ఎత్తు కాదు, మన ఆలోచనల ఎత్తే నిజమైన విజయాన్ని నిర్ణయిస్తుంది.