Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు అందరినీ ఆకర్షించగలరు..!
కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు సహజంగా ఉల్లాసంగా, ఆశావాదంగా, ఇతరులను ఆకర్షించే శక్తి కలిగి ఉంటారు.

birth date
జోతిష్యశాస్త్రం, సంఖ్యా శాస్త్రం ప్రకారం, మన పుట్టిన తేదీలు మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు సహజంగా ఉల్లాసంగా, ఆశావాదంగా, ఇతరులను ఆకర్షించే శక్తి కలిగి ఉంటారు. వీరు చుట్టుపక్కల వారిని సంతోషపెట్టే సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ.. సంతోషం నిండి ఉంటుంది.మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
నెంబర్ 1 (1, 10, 19, 28)
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది. వీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. వీరు మాటతీరు చాలా బాగుంటుంది. వీరి మాటలు అందరినీ ఆకర్షిస్తాయి. వీరు ఎక్కడ ఉన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. అందుకే, వీరు అందరికీ నచ్చేస్తారు.
నెంబర్ 5( 5, 14, 23)
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు జీవితాన్ని చాలా ఉల్సాసంగా జీవిస్తారు. వీరికి ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. సాహసాలు చేయడానికి కూడా వెనకాడరు. వీరి ఆలోచనలు చాలా చురుకుగా ఉంటాయి. వీరు ఏది మాట్లాడినా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. వీరి మాటలకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.
నెంబర్ 3(3,12, 21, 30)
ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబరబ్ 3 కిందకు వస్తారు. వీరు చాలా క్రియేటివ్ పర్సన్స్. వీరి మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందరితో సరదాగా మాట్లాడటం, నవ్వించడం, ఇతరులను జ్ఞానంతో ఆకట్టుకోవడం వీరి శక్తి. వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వీరి మాటలు మాత్రమే కాదు, వీరి మానవత్వం కూడా అందరికీ నచ్చుతుంది.
నెంబర్ 9(9,18,27)
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిలో మానవతా దృక్పథం చాలా ఎక్కువ. ఇతరుల బాధను అర్థం చేసుకోవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. ఇతరులు చెప్పేది చాలా ఓపికగా వింటారు. అందరికీ మంచి స్నేహితులు అవుతారు. అందరితోనూ సానుభూతితో వ్యవహరిస్తారు.