Birth Date:ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది..!
న్యూమరాలజీ ప్రకారం.. నాలుగు తేదీల్లో పుట్టిన వారిలో ఏదో తెలియని ఒక శక్తి, మ్యాజిక్ ఉంటుంది.
- FB
- TW
- Linkdin
Follow Us

birth date
న్యూమరాలజీ మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం పుట్టిన తేదీ ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు.. వారిలో ఉన్న ప్రత్యేకత, వారి జీవితం ఎలా సాగుతుంది అనే విషాయాలను కూడా తెలుసుకోవచ్చు. ఈ రోజు కొన్ని ప్రత్యేక తేదీల్లో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం.. న్యూమరాలజీ ప్రకారం.. నాలుగు తేదీల్లో పుట్టిన వారిలో ఏదో తెలియని ఒక శక్తి, మ్యాజిక్ ఉంటుంది. మరి, ఆ తేదీలేంటో చూద్దామా...
5వ తేదీ...
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 5వ తేదీలో జన్మించిన వారు చాలా తెలివైన వారు. వీరు జీవితంలో వచ్చే ఎలాంటి మార్పును అయినా స్వీకరించగలరు. సాహసాలు చేయడంలో అస్సలు వెనకాడరు. వారిలో ఊహాత్మక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేస్తారు. వారు ఇతరులకంటే ముందుగా ఆలోచించి, పరిస్థితులను అర్థం చేసుకొని ముందడుగు వేస్తారు. వీరికి ధైర్యం చాలా ఎక్కువ. చాలా చురుకుగా కూడా ఉంటారు.
11వ తేదీ
పదకొండు అనేది ఒక మాస్టర్ నెంబర్. ఈ తేదీలో పుట్టినవారు ఆధ్యాత్మిక దారిలో ముందుకు సాగేవారు. వీరికి చిన్నప్పటినుంచే ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. కలలపై నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందాన్ని వెదజల్లుతారు.
22వ తేదీ
ఇది మరో మాస్టర్ నెంబర్. ఈ తేదీలో పుట్టినవారు "మాస్టర్ బిల్డర్స్"గా పేరుపొందుతారు. తమ కలలను నిజం చేసుకోవడంలో వీరు ముందుంటారు. సహజమైన నాయకత్వ నైపుణ్యంతో ఇతరులకు ప్రేరణనిస్తారు. వీరు ఏ పని మొదలుపెట్టినా.. దానిని మధ్యలో ఆపేయరు. పూర్తి చేయకుండా వదిలిపెట్టరు. ఎంత కష్టమైనా దానిని పూర్తి చేస్తారు.
28వ తేదీ
ఇది సంఖ్యాశాస్త్రంలో పరిపూర్ణ సంఖ్యగా పరిగణిస్తారు. ఈ తేదీలో పుట్టినవారికి దైవ రక్షణ లభిస్తుంది. దేవుడు వీరికి ఎప్పుడూ అండగా ఉంటారు. వారు ఎప్పటికప్పుడు మార్గదర్శనాన్ని పొందుతూ, అదృష్టాన్ని ఆకర్షించగలుగుతారు. సంపదను, విజయాన్ని ఆకర్షించడంలో వీరు ముందుంటారు.
మొత్తంగా చెప్పాలంటే, ఈ తేదీల్లో జన్మించిన వారు ఇతరులకంటే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటారు. అందరినీ మంచి వైపు ప్రభావితం చేయడంలో వీరు ముందుంటారు. అందరికీ ఆదర్శంగా కూడా నిలుస్తారు.