Birth Date: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారు చాలా డేంజర్, వీళ్లతో జాగ్రత్త..!
కేవలం తమ సొంత ప్రయోజనాల కోసమే అందరితో స్నేహం చేస్తూ ఉంటారు. పైకి మంచిగా నటిస్తూనే అందరినీ మోసం చేసేస్తారు.

birth date
మన చుట్టూ చాలా రకాల మనుషులు ఉంటారు. వారిలోనూ ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం. కొందరు అందరికీ సహాయం చేసే గుణం కలిగి ఉంటే.. మరికొందరు.. మంచిగా నటిస్తూనే అందరినీ మోసం చేయాలని చూస్తూ ఉంటారు. కేవలం తమ సొంత ప్రయోజనాల కోసమే అందరితో స్నేహం చేస్తూ ఉంటారు. పైకి మంచిగా నటిస్తూనే అందరినీ మోసం చేసేస్తారు. కోపంలో ఇతరులను ఇబ్బంది పెట్టడంలో ముందుంటారు. ఇలాంటివారు చాలా డేంజర్. ఇలాంటి లక్షణాలు కొన్ని తేదీల్లో పుట్టిన వారిలోనూ ఉన్నాయి. మరి, న్యూమరాలజీ ప్రకారం.. ఆ తేదీలేంటో చూద్దామా....
నెంబర్ 1..
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారు నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి సూర్యుడు దేవుడు. వీరిలోనూ సూర్యుడి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే.. ఈ తేదీల్లో జన్మించిన వారికి కోపం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది.వీరు ఏదైనా మాట అన్నా.. వారు ఏదైనా విషయం చెప్పినా దానిని వెనక్కి తీసుకోరు. ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారు. ఇతరులు బాధపడుతున్నా కూడా పెద్దగా పట్టించుకోరు. వీరితో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. మాటలతో, చేష్టలతో ఇతరులను ఇబ్బంది పెట్టేస్తారు. కోపంలో వీరు ఏం చేస్తారో వీరికి కూడా తెలీదు.
నెంబర్ 4..
ఏ నెలలో అయినా 4, 13, 22 తేదీల్లో జన్మించినవారు నెంబర్ 4 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారిపై రాహువు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రాహువు ని పాప గ్రహం అని పిలుస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఈ సంఖ్యకు చెందిన వ్యక్తులు ఎప్పుడూ తమ ప్రయోజనం గురించే ఆలోచిస్తారు. స్వార్థం చాలా ఎక్కువ. వీరు తమ తెలివి తేటలతో ఇతరులతో పని చేయించుకుంటారు. తమ స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. కానీ, తిరిగి ఎలాంటి సహాయం చేయరు.
నెంబర్ 7...
ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 7 కిందకు వస్తారు. ఏడు సంఖ్య కేతు గ్రహానికి సంబంధించినది. ఈ తేదీల్లో జన్మించిన వారు మనసులో ఒకటి ఉంటుంది.. బయటకు మరో విషయం మాట్లాడతారు. వీరి మనసులో ఉన్నది కనిపెట్టడం ఎవరి తరమూ కాదు. వీరి దగ్గర సీక్రెట్స్ చాలా ఉంటాయి. వారు తమ ప్రణాళికలను సరైన సమయంలో ఇతరులకు అందిస్తారు. ఈ సంఖ్యలలో జన్మించిన వారితో గొడవ పడకపోవడమే మంచిది. వారు ఎవరినైనా తమ శత్రువుగా భావిస్తే, వారు వారిని ఎప్పటికీ క్షమించరు. పగ తీర్చకపోవడమే మంచిది.
నెంబర్ 9..
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి కుజుడు. మీ జాతకంలో కుజుడు మంచి స్థితిలో లేకపోతే.. మీకు కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంఖ్యలలో జన్మించిన వ్యక్తులు ప్రతి విషయంలోనూ తమ స్వంత ప్రయోజనం గురించి ఆలోచిస్తారు. వారు తరచుగా ఇతరుల భావాలతో ఆడుకుంటారు. దీనితో పాటు, ఈ సంఖ్యలలో జన్మించిన వ్యక్తులను చాలా స్వార్థపరులు. వారు తమ స్వంత ప్రయోజనం కోసం తమ శత్రువులను స్నేహితులుగా కూడా మార్చుకుంటారు.