Birth Date: ఈ నాలుగు తేదీల్లో జన్మించినవారు ఏ వస్తువులు కొనకూడదో తెలుసా?
ఈ న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు ప్రతి వస్తువును కొనకూడదట.

Birth Date
న్యూమరాలజీ ఆధారంగా మన వ్యక్తిత్వం, స్వభావం మాత్రమే కాదు.. జీవితంలోని వివిధ అంశాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ సంఖ్యా శాస్త్రంలో ప్రతి సంఖ్యకు ప్రత్యేక అర్థం, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ న్యూమరాలజీ ప్రకారం.. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వారు ప్రతి వస్తువును కొనకూడదట. ముఖ్యంగా 3, 5, 6, 9 తేదీలకు చెందిన వారు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం....
నెంబర్ 3...
ఏ నెలలో అయినా 3, 12, 23, 30 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. వీరు సహజంగా చాలా సృజనాత్మకంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే.. ఈ తేదీల్లో జన్మించినవారు కొన్ని వస్తువులు కొనకూడదు. వీరు ఎక్కువగా అందరితో కలిసి సరదాగా ఉండే వ్యక్తులు కాబట్టి.. ఒంటరితనన్నా సూచించేవి, ఒంటరిగా ఉండే వస్తువులను అస్సలు కొనకూడదు. అంతేకాదు.. వీడియో గేమ్స్, గ్యాడ్జెట్స్ లాంటివి కూడా కొనకూడదు.
నెంబర్ 5...
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 5 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు షాపింగ్ విషయంలో కాస్త ఆచి తూచి అడుగు వేయాలి. ఏది పడితే అది కొనేయకూడదు. ముఖ్యంగా ఎరుపు రంగు వస్తువులు, దుస్తులు అస్సలు కొనడదు. ఇవి వీరికి అశుభంగా పరిగణిస్తారు.అంతే కాదు..ఖరీదైన భారీ ఫర్నీచర్ కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు. పాత వస్తువులు కూడా కొనకూడదు.
నెంబర్ 6...
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 6 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు విలాసవంతమైన జీవన శైలిని ఇష్టపడతారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అయితే.. వీరు ఖరీదైన కార్లు, నగలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఇవి కొనుగోలు చేస్తే.. వీరికి ఆర్థిక సమస్యలు తెచ్చి పెడతాయి. నలుపు రంగు దుస్తులు కూడా కొనుగోలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే.. నలుపు రంగు శుక్ర గ్రహ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
నెంబర్9...
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించినవారు నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు రాగి వస్తువులు కొనుగోలు చేయకూడదు. రాగి అంగారక గ్రహానికి సంబంధించినది. ఇవి కొనుగోలు చేయడం.. ఈ తేదీల్లో పుట్టిన వారికి అంత మంచిదేమీ కాదు. రాగి పాత్రలు, నగలు.. వీరు కొనుగోలు చేయడం అంత మంచిదేమీ కాదు.