Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మైండ్ స్ట్రాంగ్, ఎవరి మాటా వినరు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇవి కాకుండా వీరు ప్రత్యేక గుర్తింపు సాధించగలరు.

Birth Date
న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ మన వ్యక్తిత్వం, ఆలోచనా విధానం, జీవిత లక్ష్యాలను బలంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా 9,18, 27 తేదీల్లో పుట్టిన వారిపై కుజ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ఇతరుల కంటే చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తారు. ఎంత మంది ముందు అయినా ధైర్యంగా మాట్లాడగలరు. వీరికి భయం ఉండదు. జీవితంలో ప్రత్యేక గుర్తింపు సాధించగలరు. మరి, ఆ గుర్తింపు ఏంటి? వీరిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం....
వీరు చాలా స్పెషల్...
సహజ నాయకత్వ లక్షణాలు...
9,18, 27 తేదీల్లో పుట్టిన వారిలో సహజంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు ఎంత మంది ఉన్నా తమ ఉనికిని చాటగలరు. ఎంతమందిని అయినా ముందుండి నడిపించే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఏ ఉద్యోగం, వ్యాపారం ఎంచుకున్నా... తొందరగా ఎదగగలరు.
2.చాలా ధైర్యవంతులు, స్ట్రాంగ్ మైండ్ సెట్...
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎమోషన్స్ కి లొంగరు. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఎదుర్కుంటారు. వీరు తాము చేసే పనిపై నమ్మకంతో ఉంటారు. ఒకసారి లక్ష్యం పెట్టుకుంటే... ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు. ఈ ధైర్యమే వీరిని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. వీరి మైండ్ కూడా చాలా స్ట్రాంగ్. ఇతరుల మాటలకు తమ ఆలోచనలను మార్చుకోరు.
న్యాయబద్ధత, నిజాయితీకి ఎక్కువ విలువ
9, 18, 27 తేదీల్లో పుట్టినవారు తప్పును సహించరు. నిజం మాట్లాడటానికి భయపడరు.
అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేరు. అవసరమైతే తమకే నష్టం వచ్చినా సరే సత్యం వైపే నిలబడతారు. అందుకే కొన్నిసార్లు వీరు కఠినంగా కనిపించినా, లోపల చాలా నిజాయితీగా ఉంటారు.
4. భావోద్వేగంగా బలంగా ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని ఇష్టపడతారు
వీరు బలంగా కనిపించినా లోపల చాలా సున్నిత మనసు కలిగి ఉంటారు. తమ భావాలను అందరితో పంచుకోరు.
నమ్మకం కలిగిన వ్యక్తులతో మాత్రమే తమ మనసు విప్పుతారు. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు. ఇది బలహీనత కాదు – వారి స్వభావం అంతే.
జీవితంలో ప్రత్యేక గుర్తింపు సాధించే అవకాశం ఎక్కువ
ఈ తేదీల్లో పుట్టినవారు సాధారణ జీవితం గడపడానికి రారు.వారిలో ఏదో ఒక రంగంలో ప్రత్యేకంగా నిలవాలనే తపన ఉంటుంది. రాజకీయాలు, పోలీస్, ఆర్మీ, క్రీడలు, మేనేజ్‌మెంట్, బిజినెస్ వంటి రంగాల్లో మంచి పేరు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చివరగా ఒక మాట
9, 18 లేదా 27 తేదీల్లో పుట్టినవారు సాధారణ వ్యక్తులు కాదు. వీరిలో ధైర్యం, నిజాయితీ, నాయకత్వం, లక్ష్యసాధన వంటి గొప్ప లక్షణాలు సహజంగానే ఉంటాయి.

