Birth Week: ఈ రోజున పుట్టిన వారు అందం, తెలివితేటల్లో నెంబర్ 1
సోమవారం జన్మించిన వారు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తుల స్వభావం చాలా బాగుంటుంది. వీరు అందరితోనూ చాల స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటారు.

Birth week
జోతిష్య శాస్త్రం, సంఖ్యా శాస్త్రం మన జీవితాలను బాగానే ప్రభావితం చేస్తాయి. ఇప్పటి వరకు మీ రాశి ఆధారంగా మీ జాతకం తెలుసుకొని ఉండొచ్చు. ఇక.. మీరు పుట్టిన తేదీ ఆధారంగా మీ వ్యక్తిత్వం తెలుసుకొని ఉంటారు. కానీ..మీరు పుట్టిన వారాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని మీకు తెలుసా? మరి, సోమవారం రోజున పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సోమవారం జన్మించిన వారు...
సోమవారం జన్మించిన వారు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తుల స్వభావం చాలా బాగుంటుంది. వీరు అందరితోనూ చాల స్నేహపూర్వకంగా, ఉల్లాసంగా ఉంటారు. వీరు చాలా ఎమోషనల్ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు. సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చాలా మృదువైన హృదయాన్ని కలిగి ఉంటారు. ఇతరులను బాధ పెట్టడం వీరికి నచ్చదు. ఎవరైనా బాధ పడుతుంటే కూడా చూడలేరు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు
సోమవారం జన్మించినవారు అందంగా , ఆకర్షణీయంగా ఉంటారు. ముఖ్యంగా సోమవారం జన్మించిన అమ్మాయిలు చాలా ముద్దుగా , అందంగా ఉంటారు. దీని కారణంగా, ప్రజలు వారి వైపు సులభంగా ఆకర్షితులవుతారు. ఎంత మందిలో ఉన్నా వీరికంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోగలరు.
మనస్సు చంచలంగా ఉంటుంది.
సోమవారం జన్మించిన వారి మనస్సు చంచలమైనది. దీని కారణంగా, వారి మనస్సు ఒక పనిపై దృష్టి పెట్టదు. అలాగే, ఈ వ్యక్తులు మూడీగా ఉంటారు. చాలా సార్లు వారు తొందరపడి లేదా భావోద్వేగపరంగా తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త ఆలోచిస్తే మంచి నిర్ణయాలే తీసుకోగలరు. కానీ, చాలా సార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తర్వాత బాధపడతారు.
కుటుంబంతో ప్రత్యేక బంధం
సోమవారం జన్మించిన వారికి వారి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. చంద్రుని ప్రభావం వల్ల వారు స్వభావరీత్యా ప్రశాంతంగా ఉంటారు. వారు కోపంగా ఉన్నప్పటికీ, కొంత సమయం తర్వాత అది తగ్గిపోతుంది.