Zodiac signs: ఈ రాశులవారికి అందంగా ఉంటే చాలు..మనసుతో పని లేదు..!
ఎవరైనా అందంగా, ఆత్మవిశ్వాసంగా ఉంటే.. వారితో స్నేహం చేయాలని, వారితో మాట్లాడాలని సింహ రాశివారు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు.

zodiac signs
జోతిష్యశాస్త్రం మన రాశి ఆధారంగా భవిష్యత్తు మాత్రమే కాదు..మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా.. జోతిష్యం పరంగా కొన్ని రాశులవారు బాహ్య సౌందర్యానికి పెద్దపీట వేస్తారు. ఎదుటి వ్యక్తి మనసు కంటే కూడా వీరికి సౌందర్యమే ముఖ్యం. అలా అని మంచి మనసుకు విలువ ఇవ్వరు అని కాదు.. కానీ వీరి ఫస్ట్ ప్రయార్టీ మాత్రం లుక్స్ కే ఇస్తారు. అందం మాత్రమే ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని వీరు నమ్ముతారు. మరి, అలాంటి రాశులేంటో చూద్దామా...
1.సింహ రాశి..
సింహ రాశివారు సహజంగా గ్లామర్, ఫ్యాషన్, అందానికి ఎక్కువగా ఆకర్షితులౌతారు. అందంగా ఉంటే గర్వంగా ఉండొచ్చు అనే అభిప్రాయం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మంచి మనసుకీ, విధేయతకు కూడా వీరు ప్రాధాన్యత ఇస్తారు. కానీ..లుక్స్ వీరి ఫస్ట్ ప్రయార్టీ అవుతుంది. ఎవరైనా అందంగా, ఆత్మవిశ్వాసంగా ఉంటే.. వారితో స్నేహం చేయాలని, వారితో మాట్లాడాలని సింహ రాశివారు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు.
2.తుల రాశి...
తుల రాశిని శుక్ర గ్రహం పాలిస్తుంది. శుక్రుడు అంటేనే అందం. అందుకే.. సహజంగానే తుల రాశివారు అందానికి ఆకర్షితులౌతారు. తమ చుట్టూ ఉన్న వాతావరణం కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని వీరు కోరుకుంటారు. అంతేకాదు.. తమ జీవితంలోకి వచ్చే భాగస్వామి కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని వీరు అనుకుంటారు. అలాంటివారినే ఎంచుకుంటారు.
3.మిథున రాశి...
మిథున రాశివారు కూడా బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హుందగా, స్టైలిష్ గా, అందంగా కనిపించేవారి పట్ల మిథున రాశివారు ఆకర్షితులౌతారు. ఎదుటివారి తెలివి తేటలను ఈ రాశివారు మెచ్చుకుంటారు. కానీ.. అందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలా తమకు నచ్చిన వారు కనపడితే.. వారి కోసం ఏదైనా చేస్తారు.
4.మేష రాశి...
మేష రాశికి చెందిన వ్యక్తులు ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటారు. కాగా.. ఈ రాశివారు కూడా అంతర్ సౌందర్యం కంటే.. బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి కళ్లు చెదరనంత అందంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వ్యక్తి కోసం వెతుకుతూనే ఉంటారు.అందంగా ఉన్నవారు ఎవరైనా ఎదురైతే.. మొదటి చూపులోనే ఆకర్షణకు గురౌతారు.
5.వృషభ రాశి..
వృషభ రాశిని శుక్ర గ్రహం పరిపాలిస్తుంది. అందుకే.. సహజంగానే ఈ రాశివారికి అందం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరు తమ కళ్లను సంతోషపెట్టే వ్యక్తి పట్ల మొగ్గు చూపుతారు. ముందు లుక్స్ ఆకర్షణీయంగా అనిపిస్తే.. ఆ తర్వాత మనసు గురించి ఆలోచిస్తారు. మనిషి లుక్స్ నచ్చిన తర్వాత.. ఆ వ్యక్తిని ఇష్టపడాలా వద్దా అనే విషయం గురించి ఆలోచిస్తారు.
6.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు సహజంగా సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. వీరు అందంగా ఉంటారు.. వీరికి నచ్చేవారు కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటారు. వీరు ఎవరినైనా ఇష్టపడాలి అంటే చూడగానే అందంగా, ఫిట్ గా ఉండాల్సిందే. అలాంటి వారు మాత్రమే వీరి కళ్లకు నచ్చుతారు. లేకపోతే పెద్దగా పట్టించుకోరు.

