MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ.. మీ నెల ఉందా?

Birth Month: ఈ 4 నెలల్లో పుట్టినవారు విదేశాల్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ.. మీ నెల ఉందా?

విదేశాల్లో స్థిరపడటం చాలామంది కల. మంచి ఉద్యోగం, కొత్త అవకాశాల కోసం చాలామంది విదేశాలకు వెళ్లాలని ఆశపడుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టినవారు చదువు, ఉద్యోగం, వ్యాపారం ద్వారా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఎక్కువ. ఆ నెలలేంటో చూడండి. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 10 2026, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Birth Month Astrology
Image Credit : gemini

Birth Month Astrology

పుట్టిన నెల, తేదీ, గ్రహస్థితి వంటి అంశాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తి చదువు, ఉద్యోగం, ఆర్థిక స్థితి మాత్రమే కాదు, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా కొన్ని గ్రహయోగాల ఆధారంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. అందుకే కొందరు వ్యక్తులు చిన్నప్పటి నుంచే విదేశాలకు వెళ్లాలని కలలు కనడం, తర్వాత నిజంగానే ఆ అవకాశాలు రావడం సాధారణంగా కనిపిస్తుందని వివరిస్తున్నారు. మరి ఏ నెలల్లో పుట్టినవారికి విదేశీ యోగం బలంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

25
జనవరి నెలలో పుట్టినవారు
Image Credit : Getty

జనవరి నెలలో పుట్టినవారు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరిలో పుట్టినవారిపై కొన్ని ప్రత్యేక గ్రహాల ప్రభావం ఉండటం వల్ల ప్రపంచాన్ని అన్వేషించే స్వభావం, కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యం ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా వీరు తమ జీవితంలో ఒక దశలో విదేశాలకు వెళ్లి కెరీర్‌ను నిర్మించుకుంటారని పండితులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!
Related image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ 6 రాశులవారికి రాజయోగం.. జూన్ వరకు పండగే పండగ!
35
మార్చిలో పుట్టినవారు
Image Credit : Asianet News

మార్చిలో పుట్టినవారు

మార్చి నెలలో పుట్టినవారిపై గురు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గురు గ్రహం విద్య, జ్ఞానం, విస్తరణకు సంకేతంగా చెప్తారు. ఈ ప్రభావం వల్ల మార్చి నెలలో పుట్టినవారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు కొత్త సంస్కృతులను అంగీకరించే స్వభావం కలిగి ఉండటం వల్ల విదేశాల్లో త్వరగా స్థిరపడతారని పండితులు చెబుతున్నారు.

45
జులై నెలలో పుట్టినవారు
Image Credit : stockPhoto

జులై నెలలో పుట్టినవారు

జులై నెలలో పుట్టినవారిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు భావోద్వేగపరులు అయినప్పటికీ, కొత్త ప్రదేశాలకు త్వరగా అలవాటు పడతారు. అంతేకాదు కుటుంబం కోసం, మంచి జీవితం కోసం పెద్ద నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా వీరికి ఉంటుంది. అందుకే జులైలో పుట్టినవారిలో చాలామంది విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తారని పండితులు చెబుతున్నారు.

55
అక్టోబర్
Image Credit : Getty

అక్టోబర్

అక్టోబర్ నెలలో పుట్టినవారిపై శుక్ర గ్రహ ప్రభావం ఎక్కువ. శుక్రుడు సౌఖ్యం, సంపద, కళాత్మకతకు ప్రతీక. వీరు లగ్జరీ లైఫ్ కోరుకుంటారు. అందువల్ల వీరు విదేశాల్లో ఉన్న అవకాశాలను వినియోగించుకొని అక్కడ స్థిరపడే దిశగా ముందుకు సాగుతారు. అంతేకాక విదేశీ కంపెనీల్లో పనిచేయడం లేదా అంతర్జాతీయ వ్యాపారాల్లో ప్రవేశించడం వంటి అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా రావచ్చని పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ugadi 2026: పరాభవ నామ ఉగాది.. కర్కాటక రాశివారికి ఈ ఏడాది ఎలా ఉండనుంది?
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు IAS, IPS వంటి పెద్ద ప్రభుత్వోద్యోగాలు సాధించే అవకాశం ఎక్కువ
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!
Related Stories
Recommended image1
Dream Astrology: కలలో పదే పదే ఇవి కనిపిస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా!
Recommended image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ 6 రాశులవారికి రాజయోగం.. జూన్ వరకు పండగే పండగ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved