MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Panchagrahi Yoga: మేష రాశిలో పంచ గ్రహ కూటమి...జాక్ పాట్ కొట్టే రాశులు ఇవే

Panchagrahi Yoga: మేష రాశిలో పంచ గ్రహ కూటమి...జాక్ పాట్ కొట్టే రాశులు ఇవే

Panchagrahi Yoga: 2026లో మేషరాశిలో 5 గ్రహాలు కలిసి పంచగ్రహ యోగాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారి భవిష్యత్తు పూర్తిగా మారిపోనుంది. వారికి అపారమైన సంపద, విజయం దక్కనున్నాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 30 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పంచ గ్రహ కూటమి...
Image Credit : Asianet News

పంచ గ్రహ కూటమి...

ఒకే రాశిలో గ్రహాలు కలిసినప్పుడు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. శుభ రాజయోగాలు ఏర్పడినప్పుడు అదృష్టం రెట్టింపు అవుతుంది. అదే అశుభ రాజయోగం అయితే.. కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.  కాగా, మే నెలలో మేష రాశిలో పంచ గ్రహ కూటమి ఏర్పడనుంది. అంటే.. ఐదు గ్రహాలు ఒకేసారి ఒకే రాశిలో కలవనున్నాయి. ఇది అత్యంత శుభకరమైన యోగం. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు.. ఈ ఐద గ్రహాలు ఒకేసారి  ఈ రాశిలో చేరడంతో పంచ గ్రహ యోగం ఏర్పడుతుంది. మరి.. ఇది ఏ రాశులకు అదృష్టాన్ని తెస్తుందో ఇప్పుడు చూద్దాం…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మేష రాశి..
Image Credit : Getty

మేష రాశి..

ఈ పంచ గ్రహ కూటమి మేష రాశి మొదటి ఇంట్లో సంచరిస్తోంది. దీని వల్ల ఈ రాశివారికి విపరీతమైన  లాభాలు కలుగుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.  కొత్త ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. తల్లిదండ్రుల సపోర్ట్ తో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు.  భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి.

Related Articles

Related image1
Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది
Related image2
May Horoscope: అద్భుత రాజయోగం... మే నెలలో ఈ 4 రాశులకు పండగే పండగ..!
35
మిథున రాశి
Image Credit : Asianet News

మిథున రాశి

మిథున రాశికి లాభ స్థానమైన 11వ ఇంట్లో ఈ పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. దీంతో వీరికి ఆర్థికంగా స్వర్ణయుగం మొదలవుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు, పాత వ్యాపారాన్ని విస్తరిస్తారు, కొత్త బ్రాంచీలు కూడా మొదలుపెడతారు. కోల్పోయినవన్నీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాటిని అధిగమించే ధైర్యం, శక్తి మీకు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలు లాభదాయకంగా మారతాయి.
45
సింహ రాశి
Image Credit : Asianet News

సింహ రాశి

సింహ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. తండ్రి నుంచి ఆస్తి పొందుతారు. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి కలలు నెరవేరుతాయి. దానధర్మాలు చేయడంపై ఆసక్తి పెరుగుతుంది. గౌరవప్రదమైన పదవులు పొందుతారు. ప్రభుత్వంలో కీలక పదవులు, రాజకీయ పలుకుబడి పొందే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారు త్వరలో శుభవార్త వింటారు. బంగారం, ఆస్తులు, ఆభరణాలు, వస్త్రాలు వంటివన్నీ పొందే సమయం దగ్గరలోనే ఉంది.
55
ధనుస్సు రాశి..
Image Credit : Asianet News

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి వారికి పంచమ స్థానమైన ఐదవ ఇంట్లో ఈ పంచగ్రహ యోగం ఏర్పడుతుంది. ఐదవ ఇంట్లో ఐదు గ్రహాలు ఉండటం శుభప్రదంగా పరిగణిస్తారు. పిల్లలు మీకు గర్వకారణంగా నిలుస్తారు. పెళ్లి చర్చల్లో పురోగతి ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలను ఆశించవచ్చు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. కుటుంబంలో సమస్యలు తగ్గి మీరు ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image2
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image3
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Related Stories
Recommended image1
Vaishakha Purnima: రాహు నక్షత్రంలో చంద్రుడు..ఈ రాశులకు విజయం నడుచుకుంటూ వస్తుంది
Recommended image2
May Horoscope: అద్భుత రాజయోగం... మే నెలలో ఈ 4 రాశులకు పండగే పండగ..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved