- Home
- Astrology
- న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు.. గొప్ప బిజినెస్ మ్యాన్‌లు అవ్వడం పక్కా
న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన వారు.. గొప్ప బిజినెస్ మ్యాన్‌లు అవ్వడం పక్కా
Numerology: ఆస్ట్రాలజీతో సమానంగా న్యూమరాలజీని నమ్ముతారు. మనిషి జన్మించిన తేదీ ఆధారంగా వారి మూలాంక్‌ను లెక్కిస్తారు. దీని ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తును అంచనా వేయొచ్చు. మరి 5 మూలాంక్ కలిగి ఉన్న వారి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మూలాంక్ 5 అంటే ఏమిటి?
5, 14 లేదా 23 తేదీల్లో జన్మించిన వారిని మూలాంక్ 5 కలిగినవారిగా చెబుతారు. ఈ సంఖ్య బుధ గ్రహం ప్రభావంలో ఉంటుంది. బుధుడు ఆరోగ్యం, తెలివి, వ్యాపారం, కమ్యూనికేషన్‌కి అధిపతి. అందుకే ఈ సంఖ్యలో పుట్టినవారు చురుకైన ఆలోచన, తెలివితేటలు, మాట్లాడే నైపుణ్యం ఎక్కువగా కలిగి ఉంటారని అంటారు.
సహజంగా బిజినెస్ మైండ్
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలాంక్ 5 ఉన్నవారు చిన్నప్పటి నుంచే తెలివిగా, పరిస్థితిని అంచనా వేసే సామర్థ్యంతో ఉంటారు. వీరిలో నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉంటుంది. రిస్క్ తీసుకోవడంలో భయం ఉండదు. అవకాశాలు, అదృష్టం వీరి వైపు రావడం సర్వసాధారణం. అందుకే వీరిలో వ్యాపార నైపుణ్యాలు సహజంగా అభివృద్ధి చెందుతాయని చెబుతారు.
కమ్యూనికేషన్ వీరి బలం
మూలాంక్ 5 ఉన్నవారి స్వభావం చాలా స్నేహపూర్వకంగా, ప్రభావవంతంగా ఉంటుంది. వీరు మాట్లాడే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కారాలు కనుగొంటారు. ఏ రంగంలో ఉన్నా త్వరగా పేరు సంపాదిస్తారు. వ్యాపార ప్రపంచంలో విజయం సాధించడానికి ఇవే పెద్ద ఆయుధాలు కావడంతో, ఈ సంఖ్యలో పుట్టినవారు ఎక్కువగా విజయవంతులవుతారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.
డబ్బు, పేరు, అదృష్టం
బుధుడు ధనం, తెలివి, వ్యాపారానికి ప్రతీక. మూలాంక్ 5 ఉన్నవారి దగ్గర డబ్బు నిలకడగా ఉండకపోయినా, సంపాదన శక్తి ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి పెట్టే శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. వీరికి వచ్చిన అవకాశాలను అద్భుతంగా ఉపయోగించుకుంటారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, విరాట్ కోహ్లీ, రతన్ టాటా వంటి ప్రముఖులు కూడా ఇదే మూలాంక్‌కు చెందినవారు కావడం విశేషం.
మూలాంక్ 5 వారికి కలిసొచ్చే రోజులు
బుధవారం వీరికి అత్యంత శుభదినంగా చెబుతారు. ఈ రోజు గణేశుడిని పూజించడం మంచిది. “ఓం గం గణపతయే నమః”, “ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః” మంత్రాలను 108 సార్లు జపిస్తే మనశ్శాంతి, నిర్ణయశక్తి పెరుగుతాయి. పన్నా (ఎమరాల్డ్) రత్నం బుధుని అనుగ్రహానికి సూచకం. దీనిని బుధవారం కుడిచేతి చిటికన వేలికి ధరిస్తే శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. ఆకుపచ్చ రంగు మూలాంక్ 5 వారికి అత్యంత శుభరంగంగా భావిస్తారు.

