Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యను బాగా డామినేట్ చేస్తారు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ బట్టి వ్యక్తుల స్వభావం మారుతుంటుంది. కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యపై ఆధిపత్యం చెలాయిస్తారట. వారి మాటే అందరూ వినాలని కోరుకుంటారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.

Dominating Husbands by Date of Birth
భార్యా భర్తల బంధంలో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోతేనే ఆ బంధం సంతోషంగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరిలో ఒకరు మరొకరిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే ఆ బంధం విచ్ఛిన్నమవుతుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యపై ఆధిపత్యం చేస్తారట. అంతేకాదు ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా వారే నిర్ణయం తీసుకుంటారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.
మూల సంఖ్య నాలుగు
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య నాలుగు అవుతుంది. ఈ తేదీల్లో పుట్టినవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు భార్యను, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు. ప్రతి పనిని ఎలా చేయాలో ఖచ్చితమైన అవగాహన కలిగి ఉంటారు. అయితే వీరు ప్రేమగా, బాధ్యతగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు భార్యపై ఆధిపత్యం చెలాయిస్తారు.
మూలసంఖ్య 8
ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టినవారి మూలసంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టినవారు సూర్యుని శక్తితో ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా వారే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబాన్ని సక్రమంగా నడిపించడంలో బాధ్యతగా ఉంటారు. కానీ అందరూ వారి మాటే వినాలని కోరుకుంటారు. దానివల్ల భార్య కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మూల సంఖ్య 9
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు కుజుని ప్రభావంతో ఉంటారు. వీరు అన్ని విషయాల్లో బాధ్యతగా ఉండాలనుకుంటారు. కానీ వారు అనుకున్నది జరగకపోతే, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కూడా వెనుకాడరు. కుజుని ప్రభావంతో వీరు చాలా ఎమోషనల్ గా, సెల్ఫిష్ గా ఉంటారు. ఈ లక్షణం వారిని భార్యపై ఆధిపత్యం చేసేలా చేస్తుంది.