Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు స్నేహితుల కోసం ఏదైనా చేస్తారు!
సంఖ్యాశాస్త్రంలో మూలసంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంది. మూల సంఖ్య ద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, భవిష్యత్ గురించి తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీల ఆధారంగా మూలసంఖ్య ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవాళ్లు కుటుంబం పట్ల ప్రేమను, స్నేహంలో నిజాయతీగా ఉండటంతోపాటు సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా ఎదుగుతారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఇంత మంచి క్వాలిటీస్ కలిగి ఉంటారో ఓసారి చూద్దామా...

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 1. సూర్యుడిని మూలసంఖ్య 1కి అధిపతిగా భావిస్తారు. దీన్ని జీవశక్తికి చిహ్నంగా భావిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారు? ఏం సాధిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.
నిజాయతీపరులు
మూల సంఖ్య 1 ఉన్నవారు నిజాయితీపరులు. ఎవరినీ మోసం చేయరు. వారి వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. వారు తమ జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో కోపిష్టిగా కూడా ఉంటారు. ఇతరుల గురించి శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారిని అమితంగా ప్రేమిస్తారు.
మంచి వ్యాపారవేత్తలుగా...
మూల సంఖ్య 1 ఉన్నవారు భవిష్యత్తులో మంచి ప్రగతి సాధిస్తారు. వారు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. మూల సంఖ్య 1 ఉన్నవారు చాలా చురుకుగా ఉంటారు. వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
మంచి స్నేహితులుగా ఉంటారు
మూల సంఖ్య 1 ఉన్నవారు తమ స్నేహాన్ని చాలా నిజాయితీగా కాపాడుకుంటారు. కష్టకాలంలో స్నేహితులను ఒంటరిగా వదిలిపెట్టరు. వారి సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఇచ్చిన మాట కచ్చితంగా నిలబెట్టుకుంటారు.